35.2 C
Hyderabad
May 1, 2024 01: 34 AM
Slider జాతీయం

శశిథరూర్‌ కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

seshi tharoor

వివాదాస్పద కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్‌ రాసిన ‘ యాన్‌ ఎరా ఆఫ్‌ డార్క్‌నెస్: ది బ్రిటీష్‌ ఎంపైర్‌ ఇన్‌ ఇండియా‌’ పుస్తకానికి నాన్‌ ఫిక‌్షన్‌ విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. భారత్‌పై బ్రిటీష్‌ పాలకుల ప్రభావం గురించి, దేశాన్ని ఎలా నాశనం చేశారనే దానిపై ఈ పుస్తకాన్ని రాశారు.

భారత వనరులను బ్రిటన్‌ పాలకులు ఎలా అపహరించారు? మన వస్త్ర, ఉక్కు, షిప్పింగ్‌  పరిశ్రమలను ఎలా నాశనం చేశారనే దానిపై ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారు. శశిథరూర్‌ ఈ పుస్తకాన్ని 2016లో విడుదల చేశారు. 2019 సంవత్సారానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను బుధవారం 23 భాషల్లో ప్రకటించారు.

సాహిత్య అకాడమీ పురస్కారం కింద ఆయన రూ. లక్ష నగదు బహుమతిని పొందనున్నారు. శశిథరూర్‌ చాలా పుస్తకాలు రచించారు. అందులో ప్రముఖంగా ‘వై ఐయామ్‌ ఎ హిందూ’ , ‘ది పారాడాక్సికల్‌ ప్రైమ్‌ మినిష్టర్‌’ లాంటివి ఉన్నాయి.

Related posts

సీఎం పర్యటన ఏర్పాట్లలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపూ సురేష్

Bhavani

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

Satyam NEWS

తుమ్మలగుంటలో ఘనంగా రథసప్తమి వేడుకలు

Satyam NEWS

Leave a Comment