37.2 C
Hyderabad
May 1, 2024 13: 13 PM
Slider చిత్తూరు

తుమ్మలగుంటలో ఘనంగా రథసప్తమి వేడుకలు

#tummalagunta

తిరుపతి లోని తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సూర్యప్రభ వాహన సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేకువ జామున స్వామివారిని సుప్ర భాత సేవతో మేల్కొలిపి అభిషేకాలు, ప్రత్యేక అలం కరణలు చేపట్టారు.

ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారిని భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రథసప్తమి పర్వదినాన స్వామివారు సప్త వాహనాలపై కొలువుదీరి విహరించారు.  మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు.

అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వాహన సేవల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఏపీ క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో కరోనా నిబంధనలతో వాహన సేవలు, భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు.

సప్త వాహన సేవలు

రథసప్తమి వేళ ముందుగా సూర్యప్రభ వాహనంపై కళ్యాణ వెంకన్న తేజోమూర్తిగా వెలుగొందారు. చిన్నశేష వాహనంపై కోనేటి రాయునిగా భక్తులు దర్శించారు. శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుడు తన ఇష్టుడైన గరుడు వాహనాన్ని అధిరోహించి మాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అనంతరం హనుమ వాహనంపై ఆశీనుడైన ఆపదమొక్కుల వాడిని భక్తులు సేవించారు.

కల్పవృక్ష వాహనంపై శ్రీవారు శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఊరేగుతూ భక్తజనులను అనుగ్రహించారు. సర్వభూపాలుడిపై లోకపాలకుడై అనుగ్రహించారు. చంద్రప్రభ వాహనంపై కళ్యాణ వెంకన్న కనువిందు చేశారు. చివరగా సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ ముగింపు వేడుకలో ఎమ్మెల్యే చెవిరెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

Related posts

ఉత్తరప్రదేశ్ లో 80కి 80 సీట్లు గెలిచేందుకు బిజెపి వ్యూహం

Satyam NEWS

రెవిన్యూ గ్రామ సహాయకుల ఆందోళనకు తెలంగాణ జన సమితి మద్దతు

Satyam NEWS

కిరాతకంగా అత్యాచారం హత్య చేసినా ప్రశాంతంగా ఉరి

Satyam NEWS

Leave a Comment