31.7 C
Hyderabad
May 2, 2024 10: 21 AM
Slider ఖమ్మం

వర్గ పోరాటాలు తీవ్రతరం చేయాలి

#cpiml

వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమంలో 50 ఏళ్ల విప్లవ ఉద్యమంలో సమ సమాజం కోసం అసువులు బాసిన అమరుల వీరుల ఆశయ సాధన కోసం వర్గ పోరాటాలను తీవ్రం తరం చేయాలని సిపిఐ (ఎంఎల్) ప్రజా పంధా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని  స్థానిక రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో ఖమ్మం డివిజన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరవీరుల వర్ధంతి సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ కమ్యూనిస్టు ఉద్యమంతో భూ సంస్కరణ చట్టాలు, అనేక పౌర, ప్రజాసాధిక హక్కులు కల్పించాయని విప్లవకారుల నాయకత్వన లక్షల ఎకరాలు భూములు పేద రైతులకు అందించడం జరిగిందని వివరించారు. ఈ క్రమంలో చారు , చంద్ర పుల్లారెడ్డి ,రాయల సుభాష్ చంద్రబోస్, డివి కృష్ణ ,దొరన్న, ఎల్లన్న, లాంటి అనేకమంది  ఉత్తమ కమ్యూనిస్టులు ప్రజా ఉద్యమాల కోసం తమ ప్రాణాలను అర్పించారని ఆయన కొనియాడారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రజల త్యాగాలపై ఏర్పడ్డ ప్రభుత్వ ఆస్తిని కార్పొరేట్ శక్తులకు అప్పజెట్టు దేశద్రోహంలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిత్యం అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపి ప్రజల గోలు ఉడ కొడుతున్నారని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రిత పక్షపాతంతో కాంట్రాక్టులన్నీ ప్రావీణ్యం లేని సంస్థలకు కట్టబెట్టడం కారణంగా గుజరాత్ లో జరిగిన లాంటి ప్రమాదాలు నిరంతరం పెరుగుతున్నాయని ఆయన వివరించారు.

ప్రజలకు శ్రమకు తగ్గ వేతనం చెందకుండా చెందిన అతికొద్ది వేతనాన్ని అధిక ధరల రూపంలో కొల్లగొడుతూ జీవించటానికి వీలులేని పరిస్థితులు కల్పిస్తున్నారని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు చర్చించకుండా మతాన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఉద్రిక్తలు పెంచి పబ్బం గడుపుకుంటున్నారని ఆయన విమర్శించారు అమరులను స్మరించేందుకు వారం రోజులు పాటు గ్రామ గ్రామాన అమరవీరుల సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సభకు  ముందుగా అమరవీరుల స్తూపం పై జెండాను ఎగరవేసి  అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులకు నివాళులర్పించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో pow రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ శిరోమణి, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల వెంకటేశ్వర్లు, జి రామయ్య, ఖమ్మం పాలేరు డివిజన కార్యదర్శులు c y పుల్లయ్య, ఆవుల అశోక్ పార్టీ నాయకులు ఝాన్సీ, మంగతాయి, వెంకన్న, రామనాథం తదితరులు పాల్గొన్నారు.

Related posts

కామారెడ్డి అర్ధరాత్రి వరకు కార్యదర్శుల ఆందోళన

Satyam NEWS

అక్రమ రియల్ దందాకు సహాకరిస్తున్న అధికారులపై చర్యలు

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో రెండు కరోనా కేసులు

Satyam NEWS

Leave a Comment