28.7 C
Hyderabad
April 26, 2024 09: 27 AM
Slider జాతీయం

ఆనంద్ తేల్తుంబ్దే, గౌతమ్ నవలఖాల అరెస్టు ఖండిస్తున్నాం

police arrest

ప్రజా మేధావులు, హక్కుల రంగంలో క్రియాశీల కార్యకర్తలైన ఆనంద్ తేల్తుంబ్దే, గౌతమ్ నవలఖాలు 14 తేదీన ముంబై, న్యూ ఢిల్లీ లలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టులలో లొంగిపోయారు. దీనితో వారిరువురిని భీమా-కోరేగావ్ అల్లర్ల కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద అరెస్టు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరింది.

ఇంతకు ముందే ఈ కేసులో మరో తొమ్మిదిమంది మేధావులు, క్రియాశీల కార్యకర్తలు అరెస్టై దాదాపు సంవత్సరంన్నర నుండి జైళ్లలో మగ్గుతున్న విషయం అందరికి తెలిసిందే. జనవరి 2020 లో ఈ కేసుని మహారాష్ట్ర పోలీస్ పరిధి నుండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పరిధికి మార్చడంతో వీరిరువురి అరెస్టు తప్పనిసరి అని తేలిపోయింది.

ముఖ్యంగా, కరోనా వైరస్ వ్యాపిస్తున్న ఈ సమయంలో తమను జైలుకి పంపవద్దని వీరు కోరినప్పటికీ సుప్రీమ్ కోర్టు తిరస్కరించి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి లొంగిపొమ్మని సెప్టెంబరు ఎనిమిదో తేదీన ఆదేశించడం ఒక విషాదం. అంతేకాక, భావాల్ని కలిగివుండడం నేరం కాదన్న తన సూత్రాన్ని సుప్రీమ్ కోర్టు తానే తిరగతోడినట్లయింది.

న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ఇటువంటి ఘటనలు అనుమానానికి ఆస్కారం కల్పిస్తున్నాయి. మొత్తం భీమా-కోరేగావ్ అల్లర్ల కేసు భావ ప్రకటనా స్వేచ్ఛ, నిరసన హక్కులపై బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ దాడి తప్ప మరొకటి కాదు.

ఇదే క్రమంలో భాగంగా ‘అర్బన్ నక్సల్స్’ అని మేధో వర్గంలోని అనేకమందిపై వేస్తున్న ముద్ర వారిని భయభ్రాంతుల్ని చేయడానికి ఉద్దేశించింది. తద్వారా, సమాజం అంతటా ఈ భయం వ్యాపించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. భావ ప్రకటనా స్వేచ్చని, నిరసన తెలిపే హక్కుని అణచివేయడానికి చట్ట- విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, జాతీయ భద్రతా చట్టం, ప్రజా భద్రతా చట్టం, తదితర చట్టాలని దుర్వినియోగం చేయడానికి అది వెనుకాడడం లేదు.

ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి పాలించే ఈ ధోరణి, కేంద్ర ప్రభుత్వం అనుసరించే హిందూత్వ భావజాలానికున్న ఫాసిస్టు స్వభావానికి ఒక తార్కాణం. ఆనంద్ తేల్తుంబ్దే, గౌతమ్ నవలఖాల అరెస్టులను ఖండిస్తున్నాం. వారిరువురితో సహా భీమా-కోరేగావ్ కేసులో జైళ్లలో ఉన్న పదకొండుమందిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాం.

 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, జాతీయ భద్రతా చట్టం, ప్రజా భద్రతా చట్టం లాంటి నిరంకుశ చట్టాలని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

కే. ఎస్. చలం, చందు సుబ్బారావు, ఏ. సుబ్రహ్మణ్యం, అబ్దుల్ నూర్ బాషా, ఆర్. వి. రామారావు, మందలపర్తి కిషోర్, కే. రవిబాబు, దివి కుమార్, బి. అరుణ, బి. సూర్యసాగర్, ఎస్. వెంకటరావు, కే. లక్ష్మయ్య, కే. వర ప్రసాద్, కే. సత్యరంజన్, జి. కోటేశ్వరరావు, టి. మనోహరనాయుడు, వల్లూరు శివప్రసాద్, బి. జమిందార్,

డా. వి. రాంప్రసాద్, సి. భాస్కరరావు, గాదె సుబ్బారెడ్డి, ఎస్. అనిల్ కుమార్, డి. వి. రాజు, ఖాదర్ మొహియుద్దీన్, ఎన్. కొండయ్య, ఏ. అమరయ్య, ఎస్. వెంకటరావు, జి. ఆంజనేయులు, కే. మునిరాజు, అరసవిల్లి కృష్ణ, ఎన్. అంజయ్య, కే. రంగారావు, సిహెచ్. వెంకటరావు, ఏ. జగన్నాధరావు, వి. అంజిరెడ్డి, పీ. భరత్, శ్రీరామ్, పుప్పాలఅనిల్, డానీ

Related posts

క్రెడాయి విజయవాడ 8 వ ప్రాపర్టీ షో ప్రారంభం

Satyam NEWS

ఎవరు నీవు?

Satyam NEWS

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ

Satyam NEWS

Leave a Comment