37.2 C
Hyderabad
May 6, 2024 13: 11 PM
Slider వరంగల్

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

#samatafoundation

గత నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సమత ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  భారీ  వర్షాలకు జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఉండే వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు.

నీరు ఉదృతంగా ప్రవహించే టప్పుడు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని, అలా చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతం ములుగు జిల్లాలో ఎక్కుగా ఉన్నందున జిల్లా అధికారులు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా చూడాలన్నారు.

కరోనా కష్టకాలంలో సమతా  ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది నిరాశ్రయులను ఆదుకున్నామని, సహాయక చర్యల కోసం దిగువనిచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ 9493333899 కు సంప్రదించాలని పేర్కొన్నారు.

Related posts

గురుకుల విద్యార్థినులు అస్వస్థతకు గురైనా పట్టించుకోరా?

Satyam NEWS

ప్రతిపక్ష కూటమికి పోటీగా ఎన్ డి ఏ సమావేశం

Satyam NEWS

రోడ్డునపడ్డ నాయీ బ్రాహ్మణ కుటుంబాలు

Satyam NEWS

Leave a Comment