32.2 C
Hyderabad
May 8, 2024 13: 05 PM
Slider విజయనగరం

కరోనా నిబంధనలతో శంబర పండగను జరుపుకోవాలి

#vijayanagarampolice

కరోనా నిబంధనలు పాటిస్తూ పోలమాంబ జాతరను జరుపుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక పాటిల్ పిలుపునిచ్చారు. ఈ నెల 24, 25 తేదీల్లో మక్కువ మండలం శంబర గ్రామంలో జరిగే శ్రీ పోలమాంబ అమ్మవారి పండగను కరోనా థర్డ్ వేవ్  విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా, ప్రజల శ్రేయస్సు, ఆరోగ్యం దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆమె కోరారు.

శ్రీ పోలమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా పోలీసుశాఖ చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధి విధానాలపై పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక  వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి, దిశా నిర్దేశం చేసారు. కరోనా ప్రభావం జిల్లాలో పెరుగుతుండడంతో ఉత్సవ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటే మళ్ళీ వైరస్ ప్రభావం పెరిగి, కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

పోలమాంబ పండుగకు వచ్చే భక్తులు ప్రతీ ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ, సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలన్నారు. జాతరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నింబంధనలు పాటించాలని, డబుల్ మాస్క్ ధిరంచాలని, చేతులను తరుచూ శుభ్రపర్చుకోవాలని, సోషల్ డిస్టన్స్ పాటించాలన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకొంటామన్నారు.

పండగ నిర్వహించే ఈ నెల 24,25 తేదీలలో శంబరకు వచ్చే ప్రజా రవాణాను (బస్సులు, ఆటోలు, జీపులు) చెక్ పోస్టుల వద్దనే నిలిపేయనున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

వాహనాల నియంత్రణ

శంబరకు వచ్చే వాహనాలను నియంత్రించేందుకు ఈ క్రింద ప్రదేశాలలో (1) సాలూరు వైపు నుండి శంబరకు వచ్చే మార్గంలో మామిడిపల్లి చెక్ పోస్టు వద్ద (2) బొబ్బిలి వైపు నుండి శంబరకు వచ్చే మార్గంలో పాత బొబ్బిలి చెక్ పోస్టు వద్ద (3) పార్వతీపురం వైపు నుండి శంబరకు వచ్చే మార్గంలో చినభోగిలి చెక్ పోస్టు వద్ద (4) నంద తదితర గ్రామాల నుండి వచ్చే మార్గంలో ఎస్. పెద్దవలస చెక్ పోస్టు వద్ద (5) పార్వతీపురం వెంకం పేట గోళీల మీదుగా వచ్చే వాహనాలను వెంకట బైరిపురం వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ప్రజలంతా వీలైనంత వరుకు ఇండ్ల వద్దనే సాంప్రదాయబద్ధంగా శ్రీ పోలమాంబ పండగను జరుపుకోవాలని, పంగడకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాల్సిందిగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక ప్రజలను కోరారు.

పండగకు 600మందితో పోలీసు బందోబస్తు శంబర పోలమాంబ పండుగను సాఫీగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు 600మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

పార్వతీపురం ఒఎడి ఎన్.సూర్యచంద్రరావు బందోబస్తును పర్యవేక్షిస్తారన్నారు. 5 మంది డిఎస్పీలు, 16 మంది సిఐలు, 58 మంది ఎస్ఐలు/ ఆర్ ఎస్ ఐ లి, 110 మంది ఎ ఎస్ ఐలు/హెచ్ సిలు, 300 మంది కాని స్టేబుళ్ళు మరియు హెూంగార్డులు, ఏఆర్, ఎస్టీఎఫ్, ఎపిఎస్పీకు చెందిన పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహణలో పాల్గొననున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

Related posts

ఏపీ లో రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలు నిర్వహించాలి

Satyam NEWS

ఆదిలాబాద్ రూరల్ జడ్పిటిసి బరిలో రాజన్న తనయుడు

Satyam NEWS

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన  జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment