26.7 C
Hyderabad
April 27, 2024 07: 54 AM
Slider ప్రత్యేకం

ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే కీలకం

#bandisainjai

‘మిషన్-19’ పేరిట రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ‘‘ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ’’ని ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో ఎస్సీలతోపాటు అన్ని సామాజికవర్గాల ప్రజలను బీజేపీ వైపు మళ్లించడంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపట్ల ప్రజల్లో పెరుగుతున్న అనుకూలతను పార్టీగా అనుకూలంగా మార్చుకునేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.

అంతిమంగా ఆయా స్థానాల్లో కాషాయ జెండా ఎగరేసేలా ‘మిషన్-19’’ బాధ్యత మీదే’’ నని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని ఎబోడ్ హోటల్ లో బీజేపీ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది.

ఈ తొలి సమావేశానికి కమిటీ ఛైర్మన్ ఎ.పి.జితేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు ఒంటేరు జైపాల్, సీహెచ్.విఠల్, కాంచన క్రిష్ణ తోపాటు  పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, కోశాధికారి శాంతికుమార్, కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటు ఆవశ్యకత, లక్ష్యాలను, విధివిధానాలను వివరిస్తూ బండి సంజయ్ మాట్లాడారు.

ఎస్సీ నియోజకవర్గాల్లో ఓట్ల శాతమే గెలుపోటములను నిర్ణయిస్తాయని,పార్లమెంట్ ఎన్నికల్లోనూ అభ్యర్ధుల గెలుపోటములను ఎస్సీ నియోజకవర్గాల్లోని ఓట్లే కీలక పాత్ర పోషించాయన్నారు. అందుకు నా గెలుపే ఒక ఎంగ్జాంపుల్ అని పార్టీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.

నా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చొప్పదండి, మానకొండూరు ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చొప్పదండి లో 9 శాతం, మానకొండూరులో 2.52 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.  పార్లమెంట్ ఎన్నికలొచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది.  చొప్పదండిలో 61 శాతం, మానకొండూరు లో 51.5 శాతం ఓట్లు బీజేపీకి పోలయ్యాయని అందుకే నేను దాదాపు లక్ష ఓట్లతో గెలవగలిగానన్నారు.

దీనినిబట్టే ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు ఎంత అవసరమో ఆలోచించాలని బండి సంజయ్  అన్నారు.గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు బ్యాంకు క్రమేంగా పెరుగుతోందన్నారు. 19 ఎస్సీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతమే ఓ ఎంగ్జాంపుల్ అని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల తరువాత నుండి ఇప్పటి వరకు వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం చూస్తే… బీజేపీ ఓటు బ్యాంకు మరింత ఎక్కువగా పెరిగిందని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. అయితే ఎస్సీ ఓట్లను మాత్రమే కాకుండా ఆయా నియోజకవర్గాల్లోని ఇతర సామాజిక ఓట్లను కూడా గణనీయ సంఖ్యలో రాబట్టేలా కార్యాచరణను రూపొందించాలని సూచించారు. అంతిమంగా ఈ కమిటీ ఏకైక లక్ష్యం ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం… గెలుపే లక్ష్యంగా కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలన్నారు.

ప్రతి ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో కమిటీ ఒకరోజు పూర్తిగా పర్యటించాలని, నాయకులు, కార్యకర్తలతో సమావేశం కావాలని వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నివేదిక రూపొందించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అట్లాగే నియోజకవర్గ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల లిస్ట్ ను తయారు చేయాలని కోరారు. సీఎం, జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ అభివృద్ది కోసం గతంలో ఇచ్చిన హామీలను గుర్తించాలి. వాటిపై రాబోయే 3 నెలల పాటు చేపట్టాల్సిన ఆందోళన, నిరసన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ ను రూపొందించి అమలయ్యేలా చూడాలన్నారు.

ఎస్సీ నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయిలో ప్రతి బూత్, గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేయాలి. వచ్చే ఉగాది నాటికి ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నియోజకవర్గ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా సమన్వయ కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అంబేద్కర్ జయంతి రోజు (ఏప్రిల్ 14)న ఎస్సీ నియోజకవర్గాల్లో ‘బహుజన పాదయాత్ర’ పేరిట  కనీసం 2 నెలలపాటు పాదయాత్ర చేసేలా కార్యక్రమాన్ని రూపొందించాలని పార్టీ అధ్యక్షుడు తెలిపారు. ఆ నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు తప్పనిసరిగా పాల్గొనేలా చేయాలన్నారు.

నియోజకవర్గంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వివరాలను గ్రామాల వారీగా సేకరించి  ప్రచారం చేయాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగ ఖాళీల భర్తీ, దళిత బంధు పథకాలతోపాటు స్థానిక ఎమ్మెల్యే, స్థానిక టీఆర్ఎస్ నేతల అక్రమాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేలా ఈ సమన్వయ కమిటీ కృషి చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి సమస్యల జోలికి వెళ్లకుండా నియోజకవర్గానికే పరిమితమైన అంశాలపైనే ప్రజలను చైతన్యం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలన్నారు.

దళితులకిచ్చిన హామీలను టీఆర్ఎస్ ఫ్రభుత్వం విస్మరిస్తూ దళిత ద్రోహిగా మారిన విషయాన్ని దళిత సీఎం, దళిత బంధు, దళితులకు మూడెకరాల హామీలను ప్రస్తావిస్తూ ప్రజల అర్ధమయ్యేలా వివరించాలన్నారు.  అదే సమయంలో దళిత, గిరిజన, బీసీలపట్ల బీజేపీ సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేంద్ర కేబినెట్ లో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 27 మంది ఓబీసీలకు 12 మంది ఎస్సీలకు ప్రధాని మోడీ చోటు కల్పించిన అంశాన్ని, కేసీఆర్ కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీలకు జరిగిన అన్యాయాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు.

ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు అంశం ఈ కమిటీ పరిధిలోకి రాదని ఆ విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలన్నారు. అట్లాగే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ  పరిస్థితి, నాయకుల పనితీరుపై జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ నివేదికలు తెప్పించుకుంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

అంతిమంగా అన్ని సామాజికవర్గాలను పరిగణలోకి తీసుకుని కార్యక్రమాలను రూపొందించాలన్నారు. అందరినీ  సమన్వయం చేస్తూ ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీని తిరుగులేని శక్తిగా రూపొందించాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాషాయ జెండా ఎగరేలా చూడాలన్నారు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.

Related posts

ఆలయానికి నంది వాహనం బహుకరించిన మంత్రి ఆర్కే రోజా

Satyam NEWS

అత్యాచారయత్నం నిందితుడిని కాపాడే యత్నం?

Satyam NEWS

ఆషాడ పౌర్ణమి వేడుకలు: జూలై 12 న అప్పన్న గిరి ప్రదక్షిణ

Satyam NEWS

Leave a Comment