31.7 C
Hyderabad
May 2, 2024 07: 56 AM
Slider జాతీయం

ఆర్యన్‌ డ్రగ్స్ కేసు నుంచి సమీర్ వాంఖెడే అవుట్‌

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడేని ఈ కేసు విచారణ నుంచి తప్పించారు.

ఆర్యన్‌ను విడిచిపెట్టడానికి ముడుపులు అడిగారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్యన్‌ డ్రగ్స్‌తో సహా ఆరు కేసుల్ని ముంబై జోన్‌ నుంచి ఢిల్లీలోని ఎన్‌సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ కేసుల్ని విచారించడానికి ఎన్‌సీబీ సీనియర్‌ అధికారి సంజయ్‌ సింగ్‌ ఆధ్వర్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ అల్లుడు సమీర్‌ ఖాన్, నటుడు అర్మాన్‌ కొహ్లి కేసులు కూడా ఇందులో ఉన్నాయి.

Related posts

వివేకా హత్య కేసులో సీబీఐ అనుబంధ ఛార్జ్ షీట్

Satyam NEWS

భక్తి శ్రద్ధలతో గురునానక్ జయంతి వేడుకలు

Satyam NEWS

గిరిజన మహిళపై పోలీసుల దాడి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

Bhavani

Leave a Comment