31.7 C
Hyderabad
May 2, 2024 08: 03 AM
Slider నల్గొండ

కెమికల్స్ లేని శానిటరీ న్యాప్ కిన్స్ ఉచితంగా అందించాలి

#lelavati

విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్త్రీలకు అవసరానికి అవసరమైన కెమికల్స్ లేని సానిటరీ నాప్కిన్స్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందించాలని,నెలసరి సమయంలో విద్యార్థినీలకు,మహిళా ఉద్యోగులకు రెండు రోజులు సెలవు ప్రకటించాలని, పార్లమెంటులో చట్టం చేయాలని  డిమాండ్ చేస్తూ హుజూర్ నగర్ లో  ర్యాలీతో వెళ్ళి ఆర్ డి ఓ వెంకారెడ్డి కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇట్టి విషయాన్ని తీసుకెళ్లడానికి ఈనెల 8వ,తేదీన దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని జంతర్ మంతర్ దగ్గర తమ డిమాండ్ ని తెలియజేయడం జరుగుతుందని అన్నారు.ఈ విషయంపై ప్రతి ఒక్కరు స్పందించాలని,ప్రతి ఇంట్లో స్త్రీలు ఉంటారని,వారి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని లీలావతి కోరారు.

ఈ కార్యక్రమంలో స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్,శ్రీ చైతన్య టెక్నో స్కూల్, వి.వి.ఎమ్,ఎమ్.డి.ఆర్,ప్రభుత్వ బాలుర హై స్కూల్,ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు,అధ్యాపకులు,ఉపాధ్యాయులు, స్రవంతి,విజయ,షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ముస్లింలపై జరుగుతున్న దాడులపై టీడీపీ నేత భత్యాల నిరసన

Satyam NEWS

నేడు చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే జయంతి

Satyam NEWS

28న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో మహాత్మాగాంధీ ప్రార్థనాగీతం ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment