38.2 C
Hyderabad
April 29, 2024 21: 20 PM
Slider హైదరాబాద్

ప్రతి బస్తీలో పరిశుభ్రతను పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలి

#kaleruvenkatesh

అంబర్పేట నియోజకవర్గంలో ప్రతి బస్తీలో ఎస్ఎఫ్ఐ సిబ్బందితో చెత్త పేరుకుపోకుండా శానిటైజేషన్ చేసి, పరిశుభ్రతను పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలని, ఏదైనా సమస్యలుంటే తప్పకుండా దృష్టికి తీసుకురావాలని అధికారులకు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్  సూచించారు.

గోల్నాక లోని క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబర్ పేట నియోజకవర్గంలోని వైభవ్ నగర్, సోమ సుందర్ నగర్, రామకృష్ణ నగర్ లలో జరుగుతున్న వివద్ద పార్కు అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

భవిష్యత్తు అవసరాలను స్థానిక బస్తీ వాసుల ఆకాంక్షలను కూడా దృష్టిలో ఉంచుకొని మోడల్ పార్కుల వలె పూర్తి స్థాయిలో అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని సూచించారు. కుమ్మరివాడి, భుర్జ్ గల్లి, కుప్టిగూడ, చప్పల్ బజార్, పాముల బస్తీల్లో సీసీ రోడ్లను వేయడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు.

ఈ లోపు ఆయా బస్తీల్లో డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ మరియు ఇతర పనులేమైనా ఉంటే పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ ప్రేరణ, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, పార్టీ నాయకులు మహేష్, దిలీప్, అనిల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

సీఎం జగన్ కుప్పం పర్యటన ఎలా సాగింది?

Satyam NEWS

సెప్టెంబర్ 11 నుంచి స్టార్ మా లో మామగారు సీరియల్

Satyam NEWS

రాజగురువుకు తాడేపల్లి నుంచి వార్నింగ్?

Satyam NEWS

Leave a Comment