37.2 C
Hyderabad
April 30, 2024 12: 54 PM
Slider నెల్లూరు

శారీరక దృఢత్వం వల్లే రోగాలు దరి చేరవు

#vikramsimhapuriuniversity

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నేడు విద్యార్ధులకు అంతర కళాశాలలో సాఫ్ట్ బాల్, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.యం. సుందరవల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి మంచి క్రీడాకారుడిగా ఎదగాలని దాని వలన శారీరకంగా  మానసికంగా దృఢంగా ఉంటారని ప్రస్తుత కరోనా పరిస్థితులలో  ఈ శారీరక దృఢత్వమే వారిని వ్యాధి బారిన పడకుండా కాపాడగలదు.

క్రీడలలో పాల్గొనడం వల్ల మెరిట్ సర్టిఫికెట్ పొంది ప్రభుత్వ ఉద్యోగాలలో  అవకాశాలు పొందవచ్చు. మిగిలిన పెద్ద యూనివర్సిటీ లతో సమానంగా ఆల్ ఇండియా అంతర విశ్వవిద్యాలయలలో  టోర్నమెంట్ను ను వి ఎస్ యూ లో నిర్వహించడానికి కనీసం సంవత్సరానికి రెండు క్రీడలతో మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు. క్రీడలపై విద్యార్ధులు ఆ శక్తి పెంపొందించుకోవాలని సూచించారు.

అదేవిధంగా క్రీడ పోటీలలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని దాని ద్వారా జీవన నైపుణ్యలూ మెరుగుపరచుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య , ప్రిన్సిపాల్ సుజా ఎస్ నాయర్ , స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ కె సునీత, ఆర్గనైజర్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ ఆర్ ప్రభాకర్, డాక్టర్ సిహెచ్ విజయ మరియు డా కోట నీలమణి కంట విశ్వవిద్యాలయ పరోధిలో ఉన్న పన్నెండు కళాశాలల క్రీడల బృందాలు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్యే బీరం ఇలాకాలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగలు

Satyam NEWS

లైట్ స్వీప్ బట్ ఓకే: సీట్లు తగ్గిన ఢిల్లీ అధికారం ఆప్ దే

Satyam NEWS

అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

Leave a Comment