27.7 C
Hyderabad
April 30, 2024 10: 57 AM
Slider ఖమ్మం

ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు

#Sanitation programs

మున్నేరు ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ మున్నేరు ముంపు ప్రాంతం 35వ డివిజన్ లోని మోతినగర్ లో పర్యటించి, ముంపు సహాయక చర్యలను తనిఖీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ, వరద ఏ మేరకు వచ్చింది, ఏ ఏ నష్టం మేర జరిగింది అడిగి తెలుసుకున్నారు.

వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే చేపట్టుటకు వచ్చింది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి సర్వే చేపట్టి, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలని, నమూనాలు సేకరించి పరీక్షలు చేపట్టాలని అన్నారు. ముంపు ప్రాంతాల్లో ఇంటింటి సర్వే కు 21 బృందాలు ఏర్పాటు చేసినట్లు, ఇప్పటి వరకు 3026 ఇండ్ల సర్వే చేపట్టి, 10297 మంది కవర్ చేసినట్లు, జ్వరం, దగ్గు, జలుబు, ఒంటినొప్పులు, గొంతునొప్పి, తలనొప్పి, కండ్ల కలక తదితర లక్షణాలున్న 34 మందిని గుర్తించి చికిత్స అందించినట్లు తెలిపారు.

నీటి నిల్వల్లో ఆయిల్ బాల్స్ వేయాలని, దోమల నియంత్రణకై చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యర్థాలు, చెత్త కుప్పలు తొలగించాలని, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. త్రాగునీటిలో క్లోరిన్ మాత్రలు వేసుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముంపు బాధితులకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ చర్యల్ని చేపడతామన్నారు. ఈ నెల 25 న భారీ వర్షం తో మున్నేరు పరిసర ప్రాంత వాసులను అప్రమత్తం చేసినట్లు, పెరిగిన మున్నేరు ఉధృతి తగ్గడం, మళ్ళీ 26 న రాత్రి చాలా వేగంగా మున్నేరు ప్రమాదకర స్థాయికి చేరినట్లు తెలిపారు.

పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, పునరావాస కేంద్రాలకు తరలించినట్లు, కొన్నిచోట్ల భవనాల పై అంతస్తులలో ఉన్న వారు పునరావాస కేంద్రాలకు తరలుటకు సమ్మతించక పోవడం జరిగిందన్నారు. ఉధృతిని దృష్టిలో పెట్టుకొని, 27న ఉదయం ఇలాంటి వారిని 70 పై చిలుకు మందిని కాపాడడం జరిగిందన్నారు.

విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరణ జరిగిందని, రాబోయే 10 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇంటింటికి పంపిణీ చేసినట్లు ఆయన అన్నారు. ముంపు బాధితులకు సహాయార్థం దాతలు ముందుకు వస్తున్నారని, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి కోటి రూపాయలు అందించారని ఆయన తెలిపారు. 16 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వీటి సంఖ్య పెరగవచ్చని అన్నారు. దెబ్బతిన్న ఇండ్లు, వస్తువుల అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.

మున్నేరు బఫర్ జోన్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా చేసి విక్రయిస్తే, ఏమి తెలియని కొంతమంది మోసపోయి కొనుగోళ్లు చేస్తున్నారని అన్నారు. బఫర్ జోన్ మార్కింగ్ చేసి, క్రయ విక్రయాలు, కట్టడాలు చేపట్టకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.

ఈ దిశగా రిజిస్ట్రేషన్, రెవిన్యూ, మునిసిపల్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమావేశమై కార్యాచరణ చేస్తామన్నారు. వరదలకు పూర్తిగా దెబ్బతిన్న ఇండ్ల స్థానంలో మళ్ళీ కడితే ముప్పు ఉంటుందని వీరికి రెండు పడకల ఇండ్లు, ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

కలెక్టర్ తనిఖీ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు, జిల్లా వైద్య ఆరోగ్యాధికారిణి డా. బి. మాలతి, నగర పాలక సంస్థ ఉప కమీషనర్ మల్లీశ్వరి, వైద్యాధికారులు డా. సైదులు, డా. లోహిత, డా. శ్రావ్య, అధికారులు తదితరులు ఉన్నారు.

Related posts

సమాచార శాఖకు గ్రహణం: డిపిఆర్వో ఆఫీసులకు ఇక తాళం?

Satyam NEWS

న్యూ రిఫార్మ్స్:దేశంలోఎక్కడినుండైన స్వస్థలంలో ఓటు

Satyam NEWS

ఐక్యంగా ఉందాం అభివృద్ధి చెందుదాం

Satyam NEWS

Leave a Comment