38.2 C
Hyderabad
April 27, 2024 15: 46 PM
Slider విజయనగరం

పంద్రాగస్టు ఉత్సవ్ కు సన్నద్ధం అవ్వండి…

#Pandragastu Utsav

వచ్చేనెల ఆగస్టు 15వ తేదీ ఢిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగుర వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం. అలాగే దేశం యావత్తు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం అటు ఢిల్లీ తో పాటు అన్ని రాష్ఠ్రాలు సమాయత్తం అవుతున్నాయి.కార్యక్రమంలో భాగంగా ఏపీలోనూ…అలాగే విజయనగరం జిల్లాలో నూ…అదీ జిల్లా కు నాలుగు నెలల క్రితం వచ్చిన కలెక్టర్ నాగలక్ష్మి… జిల్లా అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌లులో మంచి ప్ర‌తిభ, ప‌నితీరు క‌న‌బ‌ర‌చి నిర్దేశిత ల‌క్ష్యాలు సాధించిన వారికే ప్ర‌శంసాప‌త్రాల కోసం సిఫార‌సు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ఎస్ జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. గ‌తంలో ప్ర‌శంసాప‌త్రాలు అందుకున్న వారిని మ‌ళ్లీ ఈ ఏడాది కూడా సిఫార‌సు చేయ‌వ‌ద్ద‌ని పేర్కొన్నారు.

ఒక్కో ప్ర‌భుత్వ శాఖ నుంచి ముగ్గురికి మించ‌కుండా ప్ర‌శంసాప‌త్రాల కోసం ఆగ‌ష్టు 5వ తేదీలోగా అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించాల‌న్నారు. ఆగ‌ష్టు 15న స్వాతంత్య్ర వేడుక‌లు అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోనూ ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. స్వాతంత్య్ర వేడుక‌ల్లో సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు 25 నిముషాలు మించ‌కుండా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్ధుల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించాల‌న్నారు. స్వాతంత్య్ర వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై జిల్లా క‌లెక్ట‌ర్ క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో జిల్లా అధికారుల‌తో స‌మీక్షించారు.

జిల్లా కేంద్రంలో పోలీసు మైదానంలో ఉద‌యం 9 గంట‌ల‌కు జిల్లాస్థాయి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని, ముఖ్యఅతిథి జాతీయ ప‌తాకం ఆవిష్క‌రిస్తార‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా అధికారుల‌ను క‌లెక్టర్ ఆదేశించారు. ప‌దిహేను ప్ర‌భుత్వ శాఖ‌లు త‌మ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను తెలుపుతూ శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని, ప‌న్నెండు ప్ర‌భుత్వ శాఖ‌లు త‌మ అభివృద్ధి ప‌నుల‌పై స్టాల్స్ ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

వ్య‌వ‌సాయ‌శాఖ‌, డి.ఆర్‌.డి.ఏ, వైద్య ఆరోగ్యం, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా, పి.ఆర్‌.ఇంజ‌నీరింగ్‌, విద్యాశాఖ‌, గృహ‌నిర్మాణం, మ‌హిళాశిశు సంక్షేమ‌, అట‌వీ, డ్వామా, ఏ.పి.ఎం.ఎస్‌.ఐ.డి.సి., మౌళిక వ‌స‌తులు, ఇ.పి.డి.సి.ఎల్‌., త‌దిత‌ర శాఖ‌ల‌తో పాటు అగ్నిమాప‌క‌, పోలీసు శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న వుంటుంద‌న్నారు. వేడుక‌లు ముగిసిన అనంత‌రం న‌గ‌రంలోని ముఖ్య‌మైన మార్గాల్లో ప్ర‌భుత్వ శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగేందుకు పుర‌పాల‌క‌, పోలీసు శాఖ‌లు బాధ్య‌త వ‌హించాల‌ని ఆదేశించారు.

ఈ స‌మావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, ట్రైనీ క‌లెక్ట‌ర్ బి.వెంక‌ట్ స‌హాదిత్ నాగ్, ఆర్‌.డి.ఓ. ఎం.వి.సూర్య‌క‌ళ‌, స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌లు సూర్య‌నారాయ‌ణ‌, ప‌ద్మ‌ల‌త‌, బి.సుద‌ర్శ‌న‌దొర త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే వ్యవసాయ రుణాలు

Satyam NEWS

ట్రాజెడీ: ప్రమాదం నుంచి కొడుకును కాపాడి తండ్రి మృతి

Satyam NEWS

పీఎస్ లో రికార్డులను నిశితంగా పరిశీలించిన లేడీ ఎస్పీ…!

Satyam NEWS

Leave a Comment