37.2 C
Hyderabad
May 2, 2024 11: 26 AM
Slider మెదక్

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మందు నీళ్ల స్ప్రే

hareesh 291

జహీరాబాద్ బస్టాండ్ సర్కిల్,  రోడ్డులో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకై ఆదివారం ఉదయం మంత్రి సూచనల మేరకు జిల్లా అధికారిక యంత్రాంగం సోడియం హైపో క్లోరైడ్ మందును నీళ్లలో కలిపి స్ప్రే చేయించింది.

ఇప్పటి వరకు జిల్లాలోని మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది పై చిలుకు లీటర్ల సోడియం హైపోక్లోరైట్ మందును కొనుగోలు చేసి గ్రామ పంచాయతీలకు పంపి ట్రాక్టర్ల సహాయంతో స్ప్రే చేస్తున్నామని అధికారిక వర్గాలు తెలిపాయి.

  పట్టణంలోని ప్రధాన వీధుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలందరూ సహకరించి అధికారుల నిబంధనలను పాటించి ఇంటి వద్దనే ఉండాలని ఉదయం మాత్రమే అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి నిల్వ‌ ఉంచుకోవాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

ఈ మేరకు   సోడియం హైపోక్లోరైట్ మందును నీళ్లలో కలిపి అగ్నిమాపక వాహనం, సిబ్బంది సాయంతో స్ప్రే చేస్తున్న తీరును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు అడిషనల్ కలెక్టర్ రాజేష్ షా పాల్గొన్నారు.

ఇంకా జడ్పీ ఛైర్మన్.మంజు శ్రీ  అగ్నిమాపక జిల్లా అధికారి , మున్సిపాలిటీ కమిషనర్ విక్రమ్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ , వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించారు.

Related posts

సింగపూర్ అనుకుంటున్నారా? కాదు… మన సిద్దిపేట

Satyam NEWS

No Deposit Bonus Codes Australia February 2023

Bhavani

మే డే స్ఫూర్తితో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

Satyam NEWS

Leave a Comment