42.2 C
Hyderabad
April 26, 2024 18: 15 PM
Slider మెదక్

సింగపూర్ అనుకుంటున్నారా? కాదు… మన సిద్దిపేట

#SiddipetBypass

భారీ లోడ్ తో వచ్చే లారీ తో గుంతల మయం అయిన రోడ్డు, చెత్త ను తగలబెట్టి .. పొగ, కంపుతో.. ఉక్కిరిబిక్కిరి చేసే ప్రదేశం…. ఇది నిన్నటి మాట.

ఇప్పుడు సింగపూర్ ను తలదన్నేలా మారిన సిద్దిపేటను చూస్తే ముచ్చటేస్తుంది. అద్దం లా మారిన  సిద్ధిపేట రహదారులు మంత్రి హరీష్ రావు కృషి కి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య కళశాల ఏర్పాటు చేయడంతో  బైపాస్ రొడ్డు అభివృద్ధికి మరో ముందు అడుగు పడింది.

మధ్య లో డివైడర్ తో పాటు మొక్కలు, రోడ్డు కి ఇరువైపులా చెట్లు ఏర్పాటు చేసి రహదారి ని సుందరంగా మార్చారు. రాబోయే రోజుల్లో వైద్య కళశాల ఆసుపత్రి  పూర్తి స్థాయిలో ఏర్పాటు అవుతుంది. రాత్రి సమయాల్లో వెళ్లే ప్రయాణికులను దృష్టి పెట్టుకొని సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు.

వేములవాడ కమాన్ రోడ్డు, నర్సాపూర్ చౌరస్తా రాజీవ్ రహదారి అనుసంధానం చేసే రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తో సిద్ధిపేట పట్టణం కొత్త అందం తో అవిష్కృతం కానుంది.

సిద్దిపేట పట్టణ ప్రధాన రహదారుల కు సెంట్రల్ లైటింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ రోడ్లన్ని జిగేల్ మనేలా..విద్యుత్ కాంతులీనుతున్నాయి.

సిద్ధిపేట బైపాస్ రోడ్డు జగ్జివన్ రాయ్ సర్కిల్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు రూ 3కోట్ల 50 లక్షలతో  దాదాపు 5కిమి నాలుగు వరుసల రహదారులకు ఇప్పటికే మధ్య డివైడర్ అభివృద్ధి పరిచారు.

అదేవిధంగా నర్సాపూర్ చౌరస్తా నుండి కరీంనగర్ రాజీవ్ రహదారి కు అనుసంధానం చేసే కిలో మిటర్  రోడ్డుకు  ఇప్పటికె మధ్య డివైడర్ నిర్మాణం తో అభివృద్ధి జరిగింది ఆ రోడ్డుకు కూడా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు..

వేములవాడ కమాన్ నుండి ఎల్లమ్మ గుడి వరకు దాదాపు రూ. 2కోట్ల తో 2.2 కీ మీ.డివైడర్ తో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 5కోట్ల 50 లక్షతో సిద్దిపేట బైపాస్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి..

రేపు సిద్దిపేట జగ్జివన్ రాయ్ సర్కిల్ నుండి రూరల్ పోలీసు స్టేషన్ అంబెడ్కర్ సర్కిల్ వరకు వెళ్లే బైపాస్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు.

Related posts

హిందూ ధ‌ర్మ‌ ప్ర‌చారానికి ఎస్వీబీసీ ఒక ఆయుధం

Satyam NEWS

తెలంగాణలో ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ లు

Satyam NEWS

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తెలుగుదేశం విరాళం

Satyam NEWS

Leave a Comment