35.2 C
Hyderabad
April 27, 2024 13: 18 PM
కవి ప్రపంచం

ఆర్ధిక యోధుడు

#ParupallyMatsyagiri

మెట్లులేని నిచ్చెన ఎత్తైన తాటిచెట్టు

పండిన తాటిగెలలను కొట్టి

కిందకు తోసాడు

పైన కుర్చీని అధిష్టించాడు

అక్కడ అన్నీ విషసర్పాలే

వాటి కుత్తుకల విషాన్ని

తన మేధోబలంతో లాగేసాడు

అంతర్గత కుమ్ములాటల ముఠాల మధ్య

కళ్శం లేని చీకటి గుర్రంపై

స్వారీ చేయడం మొదలు పెట్టాడు

దేశమంతా అలముకున్న ఆర్ధిక అంధకారం

పెనుతుఫానులో మునిగిపోతున్న

మన దేశపు ఓడను

లంగరేసి కాపాడిన అపర చాణుక్యుడు

కూలిన వంతెన మధ్య ఇరుక్కున్న మనిషి

విశ్వమంతా విస్తరించాడు

చేతులెత్తి దణ్ణం పెట్టే సూర్యుడయ్యాడు

ఒక వేకువన చెట్టు నుండి ఆకులా రాలిపోయాడు

దేశ రాజధానిలో చితిపై పండాల్సిన

ఆ పార్ధివదేహాన్ని పరుగులెత్తించారు

నీలిమంటల మధ్య కాలుతున్న

దేహం కోసం కన్నీటి చుక్కలు

రాల్చిన మేఘాలెన్నో

శతాబ్దాల నుండి బీటలు పడ్డ నేల

గుప్పెడు బూడిదను తనలో కలుకుంది…..

పొత్తూరి సీతారామరాజు, కాకినాడ

Related posts

హిందూత్వం

Satyam NEWS

తెలుగు జాతి రత్నం

Satyam NEWS

శ్రామికుల జ‌య‌భేరి

Satyam NEWS

Leave a Comment