40.2 C
Hyderabad
April 29, 2024 17: 38 PM
Slider కవి ప్రపంచం

సంక్రాంతి సోయగాలు

#NellutlaSunitaNew

మంచు  పూరెమ్మలతో నింగి

శ్వేత కమలమై వికసించిన వేళ

ఎరుపు పసుపు సమ్మిళిత

రంగుల వర్ణమై నులివెచ్చని

సూర్య కాంతులు

ముస్తాబైన ధరణిని తాకగా

పల్లె అందాల ప్రతిబింబమై పలకరించే

పచ్చని తోరణాలు

కళకళలాడుతూ

సంక్రాంతి లక్ష్మిని స్వాగతిస్తూ

మురిసిపోతున్న తెలుగింటి గుమ్మాలు

లోగిళ్ళలో

హరివిల్లులై విరిసిన

రంగవల్లులు

రంగుల హారమై

మెరువగా

పసిడి ఛాయతో ముద్దబంతులు పలకరించగా

పసుపు గంధంతో

స్నానమాడిన

గొబ్బెమ్మలు ముంగిళ్లలో

కొలువుతీరి

కనువిందు చేస్తూ

చలిని తరిమేసే భోగి మంటలు

భోగ భాగ్యాలను అందిస్తూ

వాకిలిలో పొంగే పొంగలి

మనసులను తీపి చేస్తూ

ఆశయాల ఉన్నతమై

గగన వీధులలో విహంగాలై

ఎగిరే పతంగుల సంకేతాలు

హరిదాసుల సంకీర్తనలు

వీనుల విందుగా

అమృత  ధారలై కురిపిస్తూ

బసవన్న ఆటలతో అలరిస్తూ

కోడిపందాలతో

కొత్త ధాన్యపు సిరులు

ఇల్లు నిండగా

వీధులన్నీ సకల కళలతో

కొలువుతీరి సందడి చేస్తూ

తరాల తార్కాణమై

కొలువు తీరిన

బొమ్మల కొలువులు

కనువిందు చేస్తూ

సంస్కృతి వారసత్వమై

చిన్నారుల్ని అభిషేకించే

భోగిపళ్ళు

ముత్తైదువుల ఆశీర్వాదాలు

నవధాన్యపు పూజలు

పితృదేవతల తర్పణాలతో

అంబరాన్ని తాకిన సంబరాలు

చిన్నారులు కేరింతలతో

చిందులు వేస్తూ

సంక్రాంతి సోయగాలు

ప్రతి ఇల్లు బృందావనమై

విరబూస్తూ

ఆత్మీయతలని రంగరించి

అనుబంధాల్ని పెనవేసుకునే

క్షణాన ఈ

ఆనంద హేల

ఆ స్వర్గమే భూతలం పైకి

దిగి వచ్చిన వేళ

ఎన్నెన్ని ఆనందాలో

ఎనెన్ని సరదాలో

ఎన్నెన్ని జ్ఞాపకాలో….

ప్రతి మదిని దోచుకునే సంక్రాంత్రి.

నెల్లుట్ల సునీత, 7989460657

Related posts

పాలనలో విఫలమైన వారు చంద్రబాబుకు పాఠాలు చెబుతారా?

Satyam NEWS

మళ్లీ కంపించిన రాజధాని ఢిల్లీ

Satyam NEWS

సంక్రాంతి సంబరాలు

Satyam NEWS

Leave a Comment