30.7 C
Hyderabad
April 29, 2024 05: 09 AM
కవి ప్రపంచం

విలక్షణ చక్రవర్తి

#Kondapally Niharini

ఏ వూరికావూరివారు మావూరివాడివంటు

నిన్ను పిలిచేరయ్య మొనగాడివని పీవీ.

ఢిల్లీ పీఠమె కాదు మా గల్లీ పిల్లల

హృదయ పీఠంలోనూ నీవేనయ్య పీవీ.

నాటి పోరాటాలు నీతినియమాలతోజేసి

నేటికీనిలిచావు ఆదర్శనేతగానీవు పీవీ

తరతరాల స్ఫూర్తి నీ తెలుగు దీప్తి

మనజాతిమెచ్చిన జ్ఞానమూర్తివినీవయ్య పీవీ.

మంత్రివైనా, ముఖ్యమంత్రివైనా

రాజనీతిలోన రాణవైతివి పీవీ.

సాంధ్రజలధిలోన స్థిరరాశిలా ప్రధానివీ నీవై

సర్వ సంస్కరణలకు ఆధ్యుడవైతివి పీవీ

అసమ్మతి కంటకాలు దాటె అపర చాణక్య నీతినీదవగ

అష్టాదశభాషాప్రావీణ్యపు ధాటి నీ నుదుట తాండవమాడెను పీవీ

ఐక్యరాజ్య సమితి అలీనసభ లేచి నీ అద్భుతోపన్యాసానికి

హర్షధ్వానాలిచ్చి,అపార అనుభవశాలివినీవనిరి పీవీ

నీ నిరాడంబరత, మా భావాంబరంపై

కీర్తి కేతనమయ్యె

మా గుండె శిఖరాగ్రాన నిలిచిన బహుముఖ ప్రకిభాశాలివి పీవీ

ఏ పుటలో ఏమిదాగున్నదోగానీచరిత గతిలో

ఈ సత్యనిర్మిత చిత్రంలో నీవు విలక్షణ

చక్రవర్తివి పీవీ !!!!!

-కొండపల్లి నీహారిణి

Related posts

అమ్మ

Satyam NEWS

ఒకే ఒక్కడు

Satyam NEWS

ప్రేమంటే

Satyam NEWS

Leave a Comment