40.2 C
Hyderabad
April 29, 2024 17: 06 PM
Slider కవి ప్రపంచం

బోనాల పండుగ

#Dr.Karnati Lingaiah

తెలంగాణ తల్లి పండుగలకు పుట్టినిల్లు

బోనాల పండుగే ప్రథమంగా వస్తుంది

తళ తళ మెరిసే బంగారు కాంతులిస్తుంది

బండికి గిత్తలు గట్టుకొని గజ్జల మువ్వలు వేసుకొని

పల్లె పల్లెకు పండుగ కళ వచ్చేస్తుంది

ఎల్లమ్మ ముత్యాలమ్మ, పోచమ్మ సహా

ఏడుగురు అక్కాచెల్లెoడ్లు,  గ్రామ దేవతలు

ఆషాడ మాసంలో పూజలందుకుంటారు

కోడి పుంజులు, మేకలతో బోనం స్వీకరిస్తారు

బెల్లం, కల్లు కుండల సాకలు అందుకుంటారు

గోల్కొండలో మహంకాళికి బోనాలు ప్రారంభం

లాల్ దర్వాజ మహంకాళి జాతర ఆరంభం

సికింద్రాబాద్ లో మహంకాళమ్మ కు బోనాలు

బల్కంపేట లో కోరికలు తీర్చే ఎల్లమ్మకు పొరుదండాలు

పసుపు కుంకుమలతో బోనం మీద బోనం పెట్టి జ్యోతిని వెలిగిస్తారు

బాజా బజంత్రిలతో అమ్మవారి సేవకు బయలు దేరుతారు

పోతరాజులు భవిష్య వాణి జ్యోష్యం చెబుతారు

పొట్టి రాజుల ఆట పాటలు అందరిని అలరిస్తాయి

వర్షాలు,  పంటలు, దేశప్రగతి విఫులంగా తెలుపుతారు

దయగల గ్రామ దేవలంతా అందరిని ఆశీర్వదిస్తారు

డా.కర్నాటి లింగయ్య, మీర్ పేట్, హైదరాబాద్, 9515298610

Related posts

స్పెషల్ కేస్: సిబిఐ కోర్టుకు వచ్చిన సిఎం

Satyam NEWS

తెలంగాణ లో కొత్తదేవుడు ఇప్పుడు కేసీఆర్

Satyam NEWS

అడవుల్లో కార్చిచ్చులపై అమ్రాబాద్ లో అవగాహన సదస్సు

Bhavani

Leave a Comment