38.2 C
Hyderabad
April 29, 2024 21: 48 PM
Slider కవి ప్రపంచం

ప్రకృతి ఒడిన పరవశించిన వేళ

#rajashreereddymortala

నీ నీడన నడచి దోబుచులాడాలని

నీ  తోడుగా నడయాడి పులకరించాలని

నీ ఒడిన మేనుమరచి పరవశనవ్వాలని

నీ పొందున పొద్దులేని జగతిన మమైక్యమవ్వాలని…

తలంపు మది నిండుగా లంగరేసి లాగగా ఓ వైపు

మంచు ముత్యాల తలంబ్రాల జల్లులతో తలమునకలై

గమ్మత్తుల మత్తులో విశ్వాన్నే త్యజిస్తానన్న బెరుకును

‘తెగింపు’  లక్ష్మణరేఖలా నిలువునా

నిలువరించెను నిట్టనిలువగా ఓ వైపు

రా…  రా … రా… అంటూ నను పురిగొల్పకు హేమంతుండవై

ఏదారిన నిను చేరి పునీతమవ్వాలో

నీ సహచరి పుడమి తల్లి తివాచీ పరచి

మరీ రహదారి గీసే

నా రాకకై  శరద్రం వరకూ వేచి ఉండలేవా….

శరద్రుడా నా ప్రియసఖుడా…!

నీ ప్రేమ పరిష్వంగాన తడిసి ముద్దై

జల్లై చిరుజల్లై… వానై  జడివానై… జాలువారనా జతగా

వలపుల వర్షాన ఉత్తుంగ తరంగమై

కడలి మైదానాన కోరికల పల్లకీన  సయ్యాటలాడ

ఊపిరందని విరహాన… ఊపిరికై తలక్రిందులుగా

వేచి ఉండుమా సఖుడా  ప్రకృతి పురుషుడివై…..

నను తట్టి తట్టి లేపకు మంచుతుంపరలు

మేనంతను చిలకరించి హేమంతుడా…!

నన్ను నేను నిలువరింపజాలను ప్రేమ తుంపరలు స్పృశించగా

నులివెచ్చని గ్రీష్ముడవై తిరిగి రారానను కూడ

చేర రారా…  శరద్రుడి సాయాన… కూడరారా…

దయ జూపరా…

జాలి నెంచి

రాజశ్రీ రెడ్డి మోర్తల,  9849611479

Related posts

విజయసాయి రెడ్డిని సోషల్ మీడియా బాధ్యత నుంచి తప్పించిన జగన్

Satyam NEWS

బాధితుల గోడు ఆలకించిన విజయనగరం పోలీసు బాస్

Satyam NEWS

నేటితో ముగియనున్న నాగోబా జాతర..

Bhavani

Leave a Comment