36.2 C
Hyderabad
May 8, 2024 17: 00 PM
Slider కవి ప్రపంచం

జయహో భారత్

Dr.S.VijayaBhaskar

కరోనా మహమ్మారి

కొరలను చాపి

కరాళ నృత్యంతో

మరణ మృదంగం మోగిస్తూ

వికటాట్టహాసంతో

విళయతాండవం చేస్తూ

ప్రపంచ దేశాలను

అతలాకుతలం చేసింది

అగ్ర రాజ్యమైన అమెరికా

అట్టుడికిపోయింది

వాణిజ్య దేశమైన చైనా

కరోనాకు పుట్టినిల్లై

ప్రపంచ దేశాల ముందు

మౌనంగా నిలబడాల్సి వచ్చింది

వైద్యరంగంలో పురోగతి

సాధించిన ఇటలీ

కరోనాను కట్టడి చెయ్యలేక

చేతులెత్తేసింది

పెద్ద పెద్ద  దేశాలుగా

ఉన్న స్పెయిన్, రష్యా

సౌదీ అరేబియా, దుబాయ్

పాకిస్తాన్ అన్ని

ఆగమాగమై అగమ్య గోచరంగా

దిక్కుతోచని పరిస్థితి కల్పించింది

కరోనా రక్కసికి చిక్కి

లక్షల మంది ప్రాణాలు కోల్పోతే

లక్షల మంది వ్యాధి సోకి

ప్రాణాలను అరచేతిలో

పెట్టుకొని  దినమొక గండంగా

బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది

భారతదేశం అభివృద్ధి

సాధిస్తున్న దేశమైనా

ఆపద సమయంలో అన్ని

దేశాలకు నేనున్నానంటూ

భరోసా ఇచ్చింది

మందులను  సరఫరా చేసింది

వైద్యులను పంపింది

ప్రపంచ దేశాల చూపు

భారత్ వైపు మరల్చ గలిగింది

రామాయణ, మహాభారత, భాగవత , వేదాలకు పుట్టినిల్లయిన భారత్

వైద్యరంగంలో పురోగతి సాధించింది

కరోనాను ఖతంచేసి

కరోనా భూతాన్ని భూస్థాపితం

చేసే సత్తా భారత్ కే ఉందని

వైరస్ ను శాశ్వతంగా రూపుమాపడానికి కంకణ బద్ధమై వాక్సిన్ తయారీలో ముందడుగు వేసింది జయహో భారత్ జయ జయహో భారత్ అంటూ ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంటుంది

మేరా భారత్ మహాన్.

డాక్టర్.  ఎస్ . విజయ భాస్కర్ , దిల్ సుఖ్ నగర్, హైదరాబాద్.

Related posts

ఉరుసు ఉత్సవాలు పోస్టర్లను ఆవిష్కరించిన విశ్వేశ్వరరెడ్డి

Satyam NEWS

తారక రత్నకు నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ

Murali Krishna

ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లు కలసి కట్టుగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment