28.7 C
Hyderabad
April 27, 2024 06: 11 AM
Slider కడప

ప్రతి ఇంట్లో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

#Balakrishna Fans

కోవిడ్ నిబంధనల కారణంగా బయటకు రాలేని నందమూరి బాలకృష్ణ అభిమానులు తమ తమ ఇళ్లలోనే కుటుంబ సభ్యుల మధ్య ఆయన పుట్టిన రోజును జరుపుకున్నారు. బహిరంగ వేడుకలు నిర్వహించే వీలు లేకపోవడం వల్ల ఇంట్లోనే కుటుంబ సభ్యులతో బాలయ్య 60వ జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటున్నామని ఆయన అభిమానులు చెబుతున్నారు.

ఇలా మూకుమ్మడిగా రికార్డు స్థాయిలో బుధవారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు జరుపు కోవడంతో గిన్నిస్ బుక్ రికార్డు సాధిస్తామని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లెజండ్ గా అభిమానులు పిలుచుకునే టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఈ యేడాది కోవిడ్ -19 మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు వారి వారి ఇండ్లలోనే జరువుకొని ప్రత్యేకత చాటుకున్నారు.

కడప జిల్లా నందలూరు, ప్రొద్దుటూరులతో పాటూ అనేక ప్రాంతాల్లో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అభిమానులు కుటుంబ సభ్యులతో కలసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

ప్లీజ్ హెల్ప్: వింత వ్యాధితో బాధపడుతున్న విద్యార్థి

Satyam NEWS

అభివృద్ది పనులకు పువ్వాడ శంకుస్థాపనలు

Murali Krishna

అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్: నగదు, బంగారం స్వాధీనం

Satyam NEWS

Leave a Comment