29.7 C
Hyderabad
May 1, 2024 05: 28 AM
కవి ప్రపంచం

నిండైన మూర్తిమత్వం

#Vaddepally Mallesham

ఐదేళ్ల పాలకవర్గాన్ని పీఠంపై స్థిరంగా నిలిపి

అపర చాణక్యుడని వేనోళ్ల కొనియాడిన

సొంత గూటి నుండి విమర్శలు ఎదుర్కొన్న

న్యాయస్థానాలు,బోనులోనిలబడినప్పుడు

తెలియనట్లు కళ్ళు మూసుకున్న కాంగ్రెస్

తెలుగు మేధావి కిచ్చిన ఆదరణ ఇది.

కలిసి పనిచేసిన సిబ్బందిని కళ్ళకద్దుకునే

స్థితప్రజ్ఞత ,నిండైన మూర్తిమత్వం

అవకాశం ఉన్న నాడే కాంగ్రెస్ ప్రభుత్వం

ఆలోచించని  భారతరత్న ప్రధానంలో

అర్హత లేనివారికిచ్చిన  పార్టీ పాత్ర లేదా?

కొఠారి స్ఫూర్తి పేదలకు నాణ్యమైనవిద్యకై

ఆశ్రమ పాఠశాలలు అందించిన ఆద్యుడు

తెలుగు అకాడమీని స్థాపించడమే కాదు

కేంద్రీయ విశ్వవిద్యాలయస్థాపనలో కృషి

 మానవ వనరుల్లో నవోదయం అందించి

 విద్యాభివృద్ధిలో కమిటీల సారథిగా

 స్వీయ రచనలు ,గ్రంథాల అనువాదాలు

 బహుముఖ ప్రజ్ఞాశాలి గా నిలబెడితే

 ఆర్థిక సంస్కరణల్లో ప్రై”వేట్”విమర్శ ఉంది.

వడ్డేపల్లి మల్లేశము, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా, 9014206412

Related posts

తొలి కిరణం

Satyam NEWS

రాఖీ ఎలా కడతావు సోదరి?

Satyam NEWS

యువతరం

Satyam NEWS

Leave a Comment