38.2 C
Hyderabad
April 29, 2024 13: 31 PM
కవి ప్రపంచం

తొలి కిరణం

#Purnima Kagaznagar

తెలుగు వారి తొలి కిరణం

ప్రధాని పదవి అధిష్టానం

పి.వి గా ప్రసిద్ధం

బహుభాషా పండితుడు గా సుప్రసిద్ధం

విప్లవాత్మక సంస్కరణకు వేసావు బీజం

వ్యవస్థని తిరిగి పట్టాలెక్కించిన ఘనత నీ సొంతం

హంగు ఆర్భాటం లేని ఒదిగి ఉండే లక్షణం

అందుకే ప్రతి చోట నీదే గా ఒక ప్రత్యేక స్థానం

వివాదాల జోలికి పోని నీ వ్యక్తిత్వం

సాధించింది గొప్ప పదవిని సైతం

పీఠాధిపతి గా నీ ప్రస్థానం

అధిగమించావూ ఆటుపోట్లను తక్షణం

అలుపెరుగక చేసావు అక్షర యుద్ధం

బాధ్యతలను మొస్తునే చేసావు సాహిత్యం

నేటి బంగారు భవితకు నీవే మార్గదర్శకం

నీ సేవలు మాకు చిరస్మరణీయం

మా హృదయాల్లో భర్తీ చెయ్యలేరెవరు నీ స్థానం

-పూర్ణిమ, కాగజ్ నగర్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా

Related posts

సెల్ఫ్ పోలీసింగ్

Satyam NEWS

వేదనాంజలి

Satyam NEWS

స్థితప్రఙ్ఞుడు

Satyam NEWS

2 comments

Poornima August 31, 2020 at 10:00 AM

ధన్యవాదాలు

Reply
Akhila thogari August 31, 2020 at 11:14 AM

Superb madam

Reply

Leave a Comment