37.2 C
Hyderabad
April 26, 2024 21: 59 PM
Slider కవి ప్రపంచం

కొత్త దస్తూరి

#Vasarachetla Jayanthi

కాలం ఒడిలో

నిత్యం ఉదయాలు దొర్లుతుంటాయి

చుట్టుకున్నచీకట్లను తొలుచుకుని 

రాలిన కొన్ని కిరణాలు నేలంతా పరుచుకుంటాయి

అన్ని ఉదయాలూ ఒకేలా ఉండవు

ఒక వర్షం

ఒక వసంతమై

ఒక ఉదయాన్ని ఆహ్వానిస్తుంది

ఈ జగత్తుకు చైతన్యాన్ని ఇస్తుంది

అన్ని జీవితాలూ వసంతమై విరియవు

వసంతాన్ని ఆహ్వానించడం మన విధి

జీవితం షడ్రుచుల  సంగమం

తీపి,వగరు,చేదు,పులుపుల మిశ్రమమే జీవితం

ఆస్వాధిస్తేనే తెలుస్తుంది రుచికీ రుచికీ మధ్య ఉన్న స్నేహం

తెలుగు గుమ్మాలకు పచ్చతోరణాలు

పసుపు పాదాలతో ఇంటి ఇల్లాలు

నూతన ఆశయాలతో గృహసీమ లో కళకళలు

ప్రతి ఉదయం వసంతం కాదు

వసంతంలా కొన్ని జీవితాలను

 చిగురింపజేయడం నేర్చుకోవాలి

ఉషస్సు వెలుగులను మననీడనున్న

 వారికి కూడా చేరనివ్వాలి

కష్టసుఖాలను సమపాళ్ళలో స్వీకరించి

నేటి ఉదయాన్ని కోకిల గానం తో ఆహ్వానించాలి

వాసరచెట్ల జయంతి, హైదరాబాద్, 9985525355

Related posts

నేనా… వంగి వంగి దణ్ణాలు పెట్టానా….?

Satyam NEWS

ధరలు నియంత్రణ చేయలేని సీఎం వెంటనే గద్దె దిగిపోవాలి

Satyam NEWS

ధరణీ పోర్టల్ ద్వారా 12 లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్

Satyam NEWS

Leave a Comment