30.7 C
Hyderabad
May 13, 2024 01: 02 AM
Slider కవి ప్రపంచం

కరిగిపోవా..

#K.Harinath

ఓ… చెలీ

నీ పై కవితా ధారలు కురిపిస్తున్న 

ఈ కవి కలం అలసిపోదెందుకో?

భావాలు ఉత్తుంగ తరంగాలై 

ఉవ్వెత్తున ఎగిసి పడతాయెందుకో?

నీ గురించి ఆలోచించని

క్షణమంటూ లేదు.  

నీ చిరునవ్వే నయాగారపు జలపాతం. 

నీ కనులే పసిడి గనులు. 

నీ చూపులే నాలో గుచ్చుకున్న

విరి తూపులు. 

నీ గుండెలో గువ్వలా 

నే ఒదిగిపోనా?

నా మది మందిరాన                                                                     

గుడి కట్టి దేవతలా నిన్నుంచనా ?

ఓ …. చెలీ

వెన్నెలే లేకుంటే

కలువకు  విలువే లేదు

ఓ … అర్థాంగీ  నీవు లేకుంటే

ఈ జీవితానికి మనుగడే లేదు-

ఇది  ముమ్మాటికీ నిజం. 

అనునిత్యం కరుణించే ఓ నా ప్రియ సఖీ

కరిగిపోవా నాలో మంచులా…?

-కె. హరనాథ్ (9703542598)

Related posts

పంచాయతీ కార్మికులకు 11వ పీఆర్సీ అమలు చేయాలి

Satyam NEWS

పిటియబుల్ పొజిషన్: కరీంనగర్ లో ఖాతా తెరవని కాంగ్రెస్

Satyam NEWS

కడప జిల్లా మునక ప్రాంతాల్లో భత్యాల పర్యటన

Satyam NEWS

Leave a Comment