26.7 C
Hyderabad
May 1, 2025 04: 40 AM
Slider ప్రత్యేకం

పిటియబుల్ పొజిషన్: కరీంనగర్ లో ఖాతా తెరవని కాంగ్రెస్

karimnagar corporation congress get no seat ponnam

కరీంనగర్ ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ని గుండెల్లో పెట్టుకుని చూసిన ప్రజలు నేడు ఎందుకో తిరస్కరిస్తున్నారు.మొన్నటి దాకా హేమా హేమీల్లాంటి నేతలు ఉన్న కరీంనగర్ లో నేడు ఒక కార్పొరేటర్ ను కూడా గెల్చుకునే స్థితిలో లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది.ముఖ్యం గా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఇలాకాలో కాంగ్రెస్గా కు ఇలాంటి దౌర్భాగ్య స్థితి రావడం బాధాకరం.

రాజషేకర్ రెడ్డి హయం వరకు కాంగ్రెస్ కు కంచు కోట గా ఉన్న కరీంనగర్‌ జిల్లా ఈ మున్సిపోల్ ఎన్నికలలో ఒక చైర్మన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోడం విమర్శలకు తావిన్స్తుంది.ఇక పొన్నం స్వంత ఇలాకా అయినా కరీంనగర్ కార్పొరేషన్‌ విషయానికి వస్తే మొత్తం 60 కార్పోరేట్‌ స్థానాలకు గాను కాంగ్రెస్‌ పార్టీ 50 స్థానాల్లోనే పోటీ చేసింది. పోటీ చేసిన స్థానాల్లో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులు మూడు డిజిట్ల ఓట్లు సాధించలేకపోయారు.డిపోసిట్ లి కుడా కోల్పోయిన దుస్థితి.

టీఆర్‌ఎస్‌ పార్టీ 33 సీట్లు, బీజేపీ 13 సీట్లు, ఎంఐఎం 6 సీట్లు, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ 3, స్వతంత్ర అభ్యర్థులు 5 సీట్లు సాధించారు.
మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 కార్పోరేషన్లను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోగా ఇక్కడ కాంగ్రెస్ ఒక్క స్తానం కుడా గెలవక పోవడంతో తెరాస కరీంనగర్ నాయకులపై ఎదురుదాడికి దిగింది. బీజేపీతో మిలాఖత్‌ అయి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ బాహాటంగానే విమర్శించారు.

కేంద్రంలో కొట్టుకునే పార్టీలు స్థానికంగా కలిసిపోవడం విస్మయానికి గురిచేసిందని ,దీంతో ఓటర్లు చాలా చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులను తిరస్కరించారని అయన ఎద్దేవా చేశారు.మొత్తానికి తెలంగాణాలో అందులో కరీంనగర్ లో పరిస్థితి మరి దుర్భరంగా ఉంది. హంగు అర్ద బలం లో అధికార పార్టీ ని ఢీకొనలేక చతికిల పడుతున్న కాంగ్రెస్ కు పునర్వైభవం ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.

Related posts

భాగ్యనగరంలో పేలుడు పదార్థాలు

Murali Krishna

ఎంపి రఘురామకృష్ణంరాజుకు మంత్రి హెచ్చరిక

Satyam NEWS

కాంగ్రెస్ ను బలోపేతం చేస్తా

Sub Editor 2

Leave a Comment

error: Content is protected !!