38.2 C
Hyderabad
April 29, 2024 21: 49 PM
Slider అనంతపురం

విదేశాల నుంచి వచ్చిన వారు ఐసోలేషన్ లో ఉండాలి

Anantapuram DIG

విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా తమ వివరాలను పోలీసులకు, అధికారులకు తెలియజేయాలని అనంతపురం రేంజ్  డీఐజీ కాంతి రాణా టాటా అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని అలా వస్తే వారి పాస్ పోర్టును రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

విదేశాల నుంచి వచ్చినవారు కచ్చితంగా ఐసోలేషన్ లో 14 రోజుల పాటు ఉండాల్సిందేనని ఆయన అన్నారు. దయచేసి అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలి.. మీ వివరాలు మావద్ద ఉన్నాయి అని ఆయన అన్నారు. లాక్ డౌన్ పాటించకుండా చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆయన అన్నారు.

ఎన్నిసార్లు చెప్పినా వినకుండా రోడ్ల మీదకు వస్తున్నారని, ఇక నుంచి ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. సెక్షన్ కింద 188 కేసులు పెడుతాం, అవసరమైతే అరెస్టు కూడా చేస్తాం. యువకులు కేసుల్లో ఇరుక్కుని తమ భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని ఆయన అన్నారు.

Related posts

ప్రజా సమస్యల పరిష్కారానికి విజయనగరంలో “టెలి-స్పందన”

Satyam NEWS

మాపై రాళ్లతో దాడి చేశారు: అందుకే ఫైరింగ్

Satyam NEWS

జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మిన ఆడియో క్లిప్

Satyam NEWS

Leave a Comment