23.7 C
Hyderabad
May 8, 2024 05: 03 AM
Slider కవి ప్రపంచం

సంక్రమణ వేళ-సంక్రాంతి హేల

#KondapallyNihariniSankranti

మందహాసాలు,మంచితనాలు మోసుకొస్తున్న రంగవల్లులు

ప్రకృతి ధర్మానికి ప్రతీకలై, ధార్మిక క్రతువుకు ఆలవాలమై, సకల సంపదలకు ఆహ్వానాలిచ్చు.

సంక్రమణ వేళ క్రమాలంకార శోభితంగా

ఒక్కో మాసం ఒక్కో రాశిలో అడుగుపెడ్తాడు సూర్యుడు!

ఒక్కో ధ్యాసలో ఒక్కో ఆశతో ఉబలాటపడ్తాడు మానవుడు!

ఉత్తరానికి వెళ్ళే నీడను ఉత్తరాయణ కాలమని స్థిరీకరిస్తూనే,మనోవిమర్శనలో

 నిన్ను పడవేస్తూనే భ్రమణ పరిభ్రమణాల తీరు తీరంపై ఆరేసినెలల  అయనాలను తిప్పి , నీ అయోమయాల్ని తొలగించ      

మార్గశిరాన్నిదాటి, పుష్యమాసానికి వస్తున్నాడు సూర్యుడు.                

శీతగాలులొకవైపు మంచుతెప్పలొకవైపు

చలినివీడే శరీరశ్రమ ఉష్ణ ప్రాప్తినిచ్చు  ఐదురాశుల ఉనికి అత్యుత్సాహమిచ్చు.

రజోగుణ సూర్యుడి సంక్రాంతి ఆగమనం మానవావసరాల బ్రతుకుదీర్చు!పంటసిరుల ధాన్యరాసులనింటికి దెచ్చు ,దక్షిణాయనానికి వచ్చు.

రైతు హృదయోత్సవ చిత్రమై గోపూజ, ప్రకృతిపూజల మూడురోజుల పండుగ,  ముచ్చటైన పండుగ!

పెద్దలపండుగన్నా, ముగ్గుల పండుగన్నా 

భోగభాగ్యాలిచ్చు భోగి మొదలు,

మకర సంక్రాతి,కనుములతో చేరి ముక్కనుముగానూ ఆనందాల్న తెచ్చు.

భోగిమంటల్లో బద్దకాన్ని దగ్ధం చేయి

పాత కలపను కాల్చి కొత్త కలపను కోరు.

కట్టెలకోసం మళ్ళీ మళ్ళీ చెట్లు నాటే ప్రేరణవ్వు. 

సూర్యరూపం , స్థిరస్వభావం! 

రేగిపండ్లు,బియ్యం,నాణాలు,పూలరెక్కలు,పాలకాయలు 

బొడబొడబోసే భోగిపండ్లనచేరు.        

పసుపుకుంకుమల కొలువుల్లోన బంతి పూల తోరణాలవ్వు .

నువ్వులుండలు తిని నవ్వుతూ మాట్లాడు!

పాలను పొంగించు, సంతసాలను 

పొంగించు!

తరతమ భేదాలొద్దనే హరిదాసు పాట

 ప్రముద గణ  సూచనయ్యే గంగిరెద్దుల ఆట

పల్లెసొగసుల్లో పగటి వేషదారులు 

జానపద విజ్ఞానవినోదాల ఒగ్గు కళాకారులు

తెలుగుదనపు ఘన సంపదగ బుడుబుక్కలవారు,

ప్రాంతానికి ఓ తీరున ప్రథమ కారణా లు

బ్రతుకు అర్థం చెప్పే గాలిపటాల సందళ్లు !

సంక్రాంతి రథం ముగ్గుగా వాకిట్లో వెలుగగా ,

తాడు తాడు కలిస్తే సంఘీభావనమై ఎదుగుతావు!

చకినాలు,అరిసెలు నోళ్ళల్లో నలుగగా పాయసాన్నాలు పంచి తీపిభావనమై మెదులుతావు!

నేలమ్మ ఆకసానికి సంకేతమై , ముగ్గుల చుక్కలు చుక్కలపోలికై వెలుగుతావు!

స్థితశక్తినిచ్చే చుక్కలు, గతిశక్తినిచ్చే గీతలు మనసులనల్లుకునే మనుగడకు ఉదాహరణవ్వు.

మునివేళ్ళ కళానైపుణ్యాల ముగ్గులమధ్య పిండికొమ్ము గరికపోచలు అలంకృతమైన గొబ్బెమ్మలు కొలువుదీరు.

పెండనూకొలిచే పండుగ ఈ చాంద్రమాసపు పండుగ .

ఎంత వింతనో ఏమో! ఎన్నిమార్పులు వచ్చినా జనవరి పద్నాలుగున్నే వచ్చే పండుగ! సంక్రాంతి పండుగ!

గ్రెగోరియన్ క్యాలెండర్లకు మాతృక ఈ క్రాంతి.

ధనురాశిని దాటి మకరరాశికి చేరే ఈ మకరసంక్రమణవేళలా , మంచిలోకి నువ్వు  ప్రయాణించి చూపు ! అదే నీ హృదయ సంక్రాంతి హేల!!

డా॥ కొండపల్లి నీహారిణి, సియాటిల్, వాషింగ్టన్, అమెరికా

Related posts

“లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్” అంటున్న ధీరజ అప్పాజీ!!

Bhavani

పులివెందుల వదిలి వైజాగ్ నుంచి పోటీ చేస్తావా?

Satyam NEWS

మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

Satyam NEWS

Leave a Comment