40.2 C
Hyderabad
May 6, 2024 19: 01 PM
Slider కవి ప్రపంచం

నీకిదే నా వందనం

#Dr.SammetaVijayaRD

అనంత ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా

ఆకాశంలో ఆశలు పుట్టిస్తూ కనిపిస్తావు

నీ రెపరెపలతో ముడిపడిన బంధం మాది

ప్రగతి పథంలో ముందుకు దూసుకు పొమ్మంటూ

అలా అలలా కదిలిస్తూ గుర్తుచేస్తావ్

జై జవాన్ జై కిసాన్ అంటూ జేజేలు చెప్తూ

నీ హుందా వెనుక ఎందరి త్యాగాన్నో తలచుకుంటాను నేను

దేశాన్ని ఆక్రమించాలనే  దగాకోరులనుంచి

దేశాభివృద్ధికి ఆటంకమైన  దుష్టశక్తుల కుయుక్తులను

కులం మతం పేరుతో నీరెక్కలు కత్తిరించే

కిలాడీలను 

నీ పై మలినాలను పూసి మసిచేసే మార్మికతనుంచి

నిన్ను కాపాడుకోవడం మాకుతెలుసు

అక్షరాలు రానికాలంలో సాగిన అమాయకపుమోసాలు

అన్నీ తెలిసాక తప్పించుకునే అతితెలివి స్కాములు

ఎన్ని చేసినా కనిపెట్టే సత్తామాది

ఎదిరించి ప్రశ్నించే గొంతుమాది

పనితనం చూపించే చేయి మాది

సంఘటితత్వానికి కలిపే చప్పట్లూ మావే

నిన్ను మరింత ఎత్తులో నిలబెట్టడం మా బాధ్యత

నీ రెపరెపలను విశ్వవ్యాప్తం చేయడం మా ప్రతిజ్ఞ

మేమేంటో తెలపేందుకు

మా ఉనికిని చాటేందుకు

నిరంతరం శ్రమిస్తూ

గుండెల నిండుగా మా భారతమాతకు

అందిస్తున్నా వందనం

-డా. సమ్మెట విజయ, 9989820215

Related posts

దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతూ భావితరాలకు బంగారు బాట

Satyam NEWS

600 బడుల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లు

Bhavani

ఇంటి ఆడబిడ్డలను గౌరవించు కోవడం మన సాంప్రదాయం

Satyam NEWS

Leave a Comment