31.2 C
Hyderabad
May 3, 2024 02: 36 AM
Slider కవి ప్రపంచం

పల్లె జాతర

#Bhikani Raju Yadav

మహమ్మారి రోగాలు భారతాన్ని చుట్టిన

శక్తి లా తల్లి వచ్చి దేశం నుండి ప్రాలదోలె

ఆ శక్తిని సంతృప్తి పరచడంలోన

ప్రజలందరూ బోనం ఎత్తె తెలంగాణలో

ఆషాడం మొదలు శ్రావణం వరకు

ప్రతి పల్లె బోనం ఎత్తె  జనం జాతరలా

ఘటంలోన బోనం వండి కల్లుసాక నైవేద్యం బెట్టి

కనులారా కాంచమని తెలంగాణ చేతులు జోడించి

తెలంగాణ భవిష్యత్తు రంగంలో చెప్పినట్లు

తెలంగాణలో నిలిచె ఆదిశక్తి అమ్మవారు

పోతరాజు నృత్యాలతో తల్లి ముందు నిలబడి

తెలంగాణను రక్షించమనే మహమ్మారిల నుండి

దేవుడే విశ్వమంతా వ్యాపించినట్లు గా

దేహమునే దేవాలయంగా మార్చి జనులు

ఇంటినే కోవెలగా చేసుకొనె వారు

బోనం సమర్పించే శక్తికి మహసంబురంగా

అనాది సంస్క్రతి ఆచారవ్యవహారాలను చాటి

కాపాడుకుంటా నిలిచే నా తల్లి తెలంగాణ

తెలంగాణ సంస్క్రతిని ఖండాతరాలకు చాటె

తెలంగాణ నిలిచే విశ్వవ్యాప్తిగా

భైకాని రాజు యాదవ్, Cell 6302053021

Related posts

చంద్రయాన్-3 విజయవంతం భారతీయులందరికి గర్వకారణం

Bhavani

తహశీల్దార్ సస్పెన్షన్

Murali Krishna

నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బదిలీ

Satyam NEWS

Leave a Comment