40.2 C
Hyderabad
May 2, 2024 17: 21 PM
Slider చిత్తూరు

శ్రీవారి భక్తులపై ఎండ ప్రభావం పడకుండా చూడండి

#Naveenkumar reddy

తిరుమల తిరుపతి కి దైవ దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులు మండుతున్న ఎండలకు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్మకర్తల మండలి ప్రత్యేక దృష్టి సారించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

శ్రీవారి భక్తులకు ఎండ తీవ్రత కారణంగా “వడదెబ్బ” (SUN STROKE) తగలకుండా తిరుమలతో పాటు తిరుపతి లోని అన్నీ ఆలయాల వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రాలను (FIRST AID CENTERS) ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద “కరోనా సమయంలో” మూతపడిన అన్నీ “పుష్కరిణి” లలో శుద్ధిచేసిన నీటిని నిల్వ ఉంచి సెక్యూరిటీ గార్డుల సంరక్షణలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పరిమిత సంఖ్యలో ప్రతినిత్యం హిందూ సాంప్రదాయం ప్రకారం తిరుమల తరహాలో భక్తులు కోనేరులో స్నానం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

తిరుమల నాలుగు మాడ వీధులతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కపిలేశ్వర స్వామి,రాములవారి గుడి గోవిందరాజ స్వామి గుడి పరిసర ప్రాంతాలలో ఎండలు తగ్గే వరకు భక్తులు నడిచి వెళ్లే మార్గంలో నీటి ట్యాంకర్ల ద్వారా నీళ్లు వదులుతూ “చలువ పందిళ్ళు” (TEMPORARY GREMAN SHEDS) వేయాలని సూచించారు.

తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు కాటేజీల వద్ద అలాగే టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద శ్రీవారి సేవకుల ద్వారా ఎండ తీవ్రత తగ్గేవరకు భక్తులకు “మజ్జిగ” “మంచినీళ్లు” ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

టీటీడీ ధర్మకర్తల మండలిలో వున్న ప్రతి ఒక్క సభ్యుడు ఒక్కొక్క టీటీడీ అనుబంధ ఆలయాలకు ప్రత్యక్షంగా వెళ్లి ఎండ తీవ్రతకు సామాన్య భక్తులు పడుతున్న పాట్లు,ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Related posts

ఎమ్మెల్యేలతో బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

Satyam NEWS

ఫిబ్రవరికి యూరప్‌లో 5 లక్షల మరణాలు డబ్ల్యూహెచ్ఓ

Sub Editor

వైసీపీ గెలుపుకు కారణమైన రెండు సంఘటనలే ఈసారి శాపం

Satyam NEWS

Leave a Comment