31.7 C
Hyderabad
May 2, 2024 09: 27 AM
Slider కవి ప్రపంచం

అక్షరాలా అమ్మ

#NutenkiRavindar22

అక్షరాల కెందుకనో

అమ్మంటే మరీ మక్కువ

అమ్మ అనే మాట

తలపుకొస్తే చాలు

పాపల్లా పారాడుతూ వచ్చి

పదాలై పరుగు లిడుతాయి

గారాలు పోతాయి మారాము చేస్తాయి

వాత్సల్యంగా అల్లుకుపోయే

వాక్యాలు సైతం

కావ్యాతిశయాలై చెంగలిస్తాయి

అమ్మ రూపు బొమ్మ కట్టాలంటే

వర్ణమాలే కాదు

వర్ణాలూ అర్ణవాల్లా పోటెత్తుతాయి

పర్వవేళా తరంగాలై అపూర్వంగా

అమ్మను కీర్తించమంటే

అన్నమయ్య సంకీర్తనలై

చిందులేస్తాయి మనోభావాలు

భావుకతేమో అపురూప భావచిత్రాలై

అద్భుతమైన చైత్రరాగా లాలపిస్తుంది

అమ్మ ప్రస్తుతి చేయని కవీ

అమ్మ ప్రస్తావన లేని కావ్యమూ

దుర్లభమంటే

అది స్వభావోక్తి అలంకారమే సుమా!

నిజానికి

అమ్మే

రెండక్షరాల ఏకైక వేదం

ఇలపై నిలిచిన ప్రేమైక దైవం

మాతృత్వం పొందని

మహిళ ఉంటుంది గానీ

అమ్మతనం లేని అతివంటూ

కానరాదు

యే లోకాన వెతుకబోయినా!

నూటెంకి రవీంద్ర, లక్షెట్టిపేట, 9491533295.

Related posts

ఎటు గాలి కొడితే అటు ఎగురుతున్న టీఆర్ఎస్ జెండా

Satyam NEWS

ద్వారకా తిరుమల గోపురానికి బంగారు తాపడం

Satyam NEWS

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులపై మర్డర్ కేసు

Satyam NEWS

Leave a Comment