33.7 C
Hyderabad
April 29, 2024 02: 30 AM
Slider కవి ప్రపంచం

తీపి గురుతుల గని!

#shyamalanew

బాల్యం.. బంగారు ప్రాయం!

బడి రోజులు  మరింత ప్రియం

జీవితానికి జేగంట ఆ బడి గంట

సమయపాలనకు  అదే కదా హెచ్చరిక

ప్రార్థన.. అదో అద్భుత ఘట్టం

కళ్లు మూస్తూ, తెరుస్తూ  చిలిపి నటనలు

తరగతి గది .. అల్లరి సామ్రాజ్యం

బెంచీలు ఎక్కడాలు.. దూకడాలు

నల్లబల్లపై   రాతలు.. చెరిపివేతలు

కొట్లాటలు, కుస్తీలు, కేరింతలు

సార్ వచ్చేసరికి అంతా గప్ చుప్

హాజరు ఘట్టం.. నవ్వుల అట్టహాసం

పాఠంతో పాటు చిట్టిపొట్టి నీతి కథలు

వింటూ..తెలివి పెంచుకుంటూ  

భోజన విరామం..అదో గొప్ప భాగ్యం!

పంచుకు తింటూ.. నవ్వుకుంటూ

హుషారు పరుగుల పి.టి. పీరియడ్

బడి వార్షికోత్సవం.. సంబురమే సంబురం

బడి.. ఓ తీపి గురుతుల గని !

అక్షయ..అక్షర జ్ఞానానిచ్చిన గురుబ్రహ్మలకు

వందనం! అభివందనం !!

( సెప్టెంబరు 5,  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా )

జె.శ్యామల

Related posts

మూడవ వార్డులోని పలు సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో సూచనలు

Satyam NEWS

నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణపై దాడి

Satyam NEWS

(Natural) Best Natural Thing To Increase Male Enhancement Cancel Fxm Male Enhancement

Bhavani

3 comments

J+GuruPrasad September 5, 2023 at 4:03 PM

Excellent narration by smt Shyamala garu

Reply
Gannavarapu+Narasimha+Murty September 5, 2023 at 4:06 PM

చాలా మంచి కవిత.బాల్యాన్ని గుర్తుకు తెచ్చేది

Reply
Dr.Ch.Nagamani September 5, 2023 at 9:34 PM

The poet aptly described the school days in nostalgic mood.

Reply

Leave a Comment