38.7 C
Hyderabad
May 7, 2024 15: 18 PM
Slider కవి ప్రపంచం

బోధనం

#sandhyasutravy new

నిర్మల వ్యక్తిత్వం

జ్ఞానతృష్ణ

సునిషిత పరిశీలన

పరిపక్వత

కొండంత ఓపిక

నవ్యతకు మొగ్గు

సమకాలిన అంశాల ఆసక్తి

అవసర అనుగుణ అన్వయం

మార్గదర్శనం

అంచనావేయు నేర్పరితనం

వృత్తిపట్ల గౌరవం

సేవాతత్పరత

కొరకరాని కొయ్యలు

మొండి ఘటాలను

సానపెట్టి మట్టిలో మాణిక్యాలుగా

జ్ఞాన కుసుమాలుగా

కూర్చి పేర్చి భవిష్యత్తు

బాధ్యత తెలియ చేయటం

గీతలతో అక్షరాలతో

నుదిటి రాతను మార్చటం

రంగుల ప్రపంచపు దారుల్ని చూపటం

తమకెన్ని బాధలున్న 

కన్పించకుండా ఉండటం

అన్ని వృత్తులకు జన్మ నిచ్చే

వృత్తి భోధనమే ధనంగా

విద్య నందించటమే ఎజెండాగా

ధనాపేక్షలేని ‍నిస్వార్థ బుద్ధితో

జ్ఞాన సారాన్ని విద్యార్థులకు

పంచి పెంచి పోషించి

మురిసి పోవటం

అక్షర విత్తులు నాటి

అక్షర సేద్యంచేసి

విద్యా పంట పండించి

జిజ్ఞాస పరులైన మేధావి

వర్గాన్ని దేశానికి

అందించే పరమోత్కృష్ట

వృత్తి “భోధనం” చేపట్టిన

బోధకు లందరికి

వందన చందనం

( సెప్టెంబరు 5,  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా )

సంధ్య సుత్రావె, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఫోన్: 9177615967, హైదరాబాద్

Related posts

వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా మల్లు భట్టి ట్రాక్టర్ ర్యాలీ

Satyam NEWS

ప్రపంచ దేశాలలో క్షణ క్షణానికి పెరుగుతున్న పాజిటీవ్ కేసులు

Satyam NEWS

రక్తపు వాంతులతో గురుకుల పాఠశాల విద్యార్థిని ఆకస్మిక మృతి

Satyam NEWS

Leave a Comment