40.2 C
Hyderabad
May 2, 2024 16: 36 PM
Slider కవి ప్రపంచం

భారతీయo

#sandhyarani erabati

బంగారు భారతీ నీకు వందనం

భువిలోన  స్వర్గమా నీకు వందనం

లేదురా మనలాంటి మాన్యమణి

లేదురా మనలాంటి పుణ్యభూమి

కర్మభూమిలో పుట్టిన మనం

వేద భూమిలో పెరిగిన  తేజం

భక్తిసంద్రపు తీరం

ముక్తి మార్గపు ద్వారం

ముత్యాల రతనాల సీమరా

సౌందర్య సాహిత్య పొలమురా

పవిత్ర నదులకు పుట్టిల్లు

మనోజ్ఞసీమల నట్టిల్లు

హిమాలయ హొయలకు

లయ పెంచు

కన్యాకుమారి సొగసును

తరియించు

మహాత్ముడు నడిచిన  నేల రా

మాహా వీరులకు నెలవురా

ఇతిహాసాలు నిండిన తల్లిరా

ఆధ్యాత్మికతకు ఇది గురువురా

భారతీయం ఓ మధురం

ఇక్కడ జన్మించడం ఓ వరం

తల్లి భారతీ నీకు వందనం

శతకోటి వందనం  

సంధ్యారాణి  ఎరబాటి,  డెట్రాయిట్,  మిచ్చిగాన్

Related posts

డెంకాడ‌, పూస‌పాటిరేగ‌ నామినేష‌న్ల కేంద్రాల‌ను ప‌రిశీలించిన ఎస్పీ

Satyam NEWS

విస్తృతంగా రాజంపేట లో బత్యాల ప్రజా చైతన్య యాత్ర

Satyam NEWS

ప్రియాంకను హతమార్చిన దుర్మార్గులు వీరే

Satyam NEWS

Leave a Comment