39.2 C
Hyderabad
April 28, 2024 11: 22 AM
Slider కడప

విస్తృతంగా రాజంపేట లో బత్యాల ప్రజా చైతన్య యాత్ర

batyala 19

కడప జిల్లా రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యం లో బుధవారం రాజంపేట పట్టణంలో ప్రజా చైతన్య యాత్ర భారీ ఎత్తున జరిగింది. ఈడిగపాలెం, జౌళి బజార్, హరిచంద్ర నగర్ స్వీపర్ కాలనీ నాలుగవ, ఒకటవ వార్డులలో ఈ చైతన్య యాత్రలో సాగింది.

ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని, వారు చెప్పిన పింఛన్, రేషన్ కార్డు, వీధి లైట్స్, డ్రైనేజ్ తదితర సమస్యలను బత్యాల నోట్ చేసుకున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేలా చుస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ అధికారుల స్పందించకపోతే తాము ప్రజల తరపున కోర్టును ఆశ్రయిస్తామని తెలియజేసారు.

ఈ పర్యటనలో భాగంగా హరిచంద్ర నగర్ లో డ్రైనేజి సమస్య వల్ల దోమలు పెరిగి జబ్బులను ఎదుర్కొంటున్నామని దానిని అండర్ గ్రౌండ్  డ్రైనేజిగా చేస్తే బాగుంటుందని తెలిపారు. అలాగే జౌళి బజార్లో సరస్వతి విద్యమందిర్ స్కూల్ పక్కన ఉన్న మున్సిపల్ జంతు వధశాలను పరిశుభ్రంగా ఉంచకపోవడం వల్ల ఆ వ్యర్థ పదార్థాల ద్వారా దుర్వాసన, దోమలు పెరిగి అనేక రకాల జబ్బులు వచ్చి ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.

అంతకుముందు ఈ జంతు వధశాల ఊరికి చివరిలో ఉండేదని ఇప్పుడు టౌన్ నడిబొడ్డున ఉండటం చాలా ఇబ్బందులకు దారితీస్తుందని వాపోయారు. దానిని మరో చోటికి మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్, పట్టణ అధ్యక్షుడు సంజీవరావు, మాజీ కౌన్సిలర్లు రాంచంద్రయ్య ఆచారి, మనుబోలు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇంకా గుగిళ్ళ చంద్రమౌళి, మన్నూరు రాజ, పబ్బిశెట్టి సుబ్రహ్మణ్యం, అభూబకార్, కరిముల్లా, ఇడిమడకల కుమార్, దరిమిశెట్టి వెంకట రమణ, మందా శ్రీనివాసులు, మళ్ళెం తిరుపాలు, పీరు, రాంనగర్ నరసింహ, కొండా శ్రీనివాసులు, తోట మోహన్, సత్య నరసింహ గుప్త, పాండురాజు, సునీల్, సుబ్బు, జడశివకుమార్, టి.యన్.యస్.ఎఫ్ పోలి శివకుమార్, సునీల్, మళ్ళెం నరేష్, కస్తూరి శ్రీనివాసులు తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

అమ్మలేదు… నాన్నను కరోనా మింగింది… అయితేనేం… మేమున్నాం

Satyam NEWS

ఆకాశమంత

Satyam NEWS

మట్టిపైపుల కంపెనీలపై జిఎస్టీ 12 శాతానికి తగ్గించాలి

Satyam NEWS

Leave a Comment