31.7 C
Hyderabad
May 2, 2024 10: 13 AM
Slider కవి ప్రపంచం

‘కొత్త’ను స్వాగతిద్దామిక

#nasreenkhan

శిశిరాన

బోసిపోయిన చెట్లన్నీ

ఆకుపచ్చ రంగును అద్దుకుని

కళకళలాడుతున్నాయి

కల్లోలిత సముద్రం

పెల్లుబికిన బడబాగ్ని

వదిలి వెళ్ళిన చారికలు

ఏదో

ఒక బతుకు మూలలో సర్దేద్దాం

ప్రాథమ్యాలకూ

ప్రాధాన్యతలకూ

విలువ తెలిపిన కాలమిది

నిర్లక్ష్యాల మూల్యం

విడమిర్చిన కాలమూ ఇదే

కాస్త గౌరవిద్దాం

మృత్యు అంచున నిలబడినా

చేదు మాటల శూలాలు

గుండెల్లో పొడిచే

తూటాల ప్రవాహమిక చాలిద్దాం

ప్రతీకారేచ్ఛకు రాజుకునే

మంటల్లో అహాలను కాల్చివేసి

సరికొత్తగా అవతరించిన వగరుకు

ఉప్పూ కారం సరిపాళ్ళుగా కలిపేద్దాం

ఆటుపోట్లంటి కష్టసుఖాలు

తీపీ పులుపుల్లా అవిభాజ్యమై

ఉప్పొంగిపోవడమో కుంగిపోవడమో

జీవన నౌకకు అనవసర కృత్యాలే

అందుకే

వెలిసిపోయిన రంగులన్నీ

సరికొత్త హంగులతో

తాజాగా కాంతులీనుతున్నాయి

అచ్చం మన మనసుల్లాగే!

ఆస్వాదిద్దామా!!

రండి!!

ప్రకృతితో మమేకమౌదాం!

ఇక అంతా శుభకృతమే!!

– నస్రీన్ ఖాన్

Related posts

ఓజో ఫౌండేషన్ ద్వారా గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో క్రొత్తగా డ్రైనేజ్ ఏర్పాటు

Satyam NEWS

మ‌ట్టిదొంగ‌ల్ని వ‌దిలేసి..పోరాడే ధూళిపాళ్ల‌ని అరెస్ట్ చేస్తారా?

Satyam NEWS

మేడారంలో సీతక్క ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment