29.2 C
Hyderabad
November 8, 2024 12: 55 PM
Slider నిజామాబాద్

మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు

#KamareddyCollector

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం రాయితీపై సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు లో మంగళవారం ఆయన చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. వలలు, వాహనాలు ప్రభుత్వం  మత్స్యకారులకు పంపిణీ చేసిందని పేర్కొన్నారు.

ప్రాజెక్టులో 48 లక్షలు చేప పిల్లలు వేయాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. రొయ్య పిల్లలను ప్రాజెక్టులో వేయాలని సూచించారు.

నిజాంసాగర్ మండలం ఆరేపల్లి లో పల్లె ప్రకృతి వనం ను పరిశీలించారు. మొక్కలు దగ్గర దగ్గరగా నాటాలని, పాదులు ఏర్పాటు చేయాలని సూచించారు. 

కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా మత్స్య శాఖ అధికారిని పూర్ణిమ, అధికారులు, మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

Bhavani

డ్రీమ్ బడ్జెట్: ఆశల పల్లకిలో ఊరేగే సర్కారూ

Satyam NEWS

విద్యార్హతను పెంచుకునేందుకు ఓపెన్ స్కూల్ మంచి అవకాశం

Satyam NEWS

Leave a Comment