38.2 C
Hyderabad
May 5, 2024 20: 34 PM
Slider కవి ప్రపంచం

రెటీనాపై చిత్రం

#Redium New

ఎర్రని ఇటుకల రంగు

ఆమె బుగ్గలపై ప్రతిఫలిస్తుంది

వెలకిల బడ్డ ఆకాశాన్ని మోస్తునట్లు

ఆమెతలపై ఇటుకల తట్ట

ఆకలి గెలుపు కోసం

బిడ్డను వీపున కట్టుకొని

పోరాడుతున్న కష్టజీవి

చెమటతో తను నిలువెల్ల నీరైన

అలపుసొలపు కానరాని ధృడకాయం

ఆ శ్రమజీవి చిత్రం

విభిన్నకోణాలకు ఆనవాలు

ఆ కదలని పెదవులు

జోలపాటకు నోచుకోని పాపాయి

భట్టి లోకాగిన ఇటుకంత గట్టిగా

బతుకు మీద భరోస ఆశ

ఆ చిత్రం

కదిలించె జీవన చిత్రం

మన మస్తిష్కమనోఫలకంపై

చెరగని చిత్రం

ఆ చిత్రాన్ని చూచిన ఎవరైన సరే

కర్మసిద్ధాంతల కారడవి దాటి

కార్మిక శ్రమ జీవన పోరాట గీతమై

ప్రచండ చండ మారుతమై

గళం కలప మంటారు

కదిలి రమ్మంటారు

రేడియమ్, పాతనగరం, హైదరాబాద్ 65, ఫోన్: 9291527757

Related posts

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

Satyam NEWS

సుగంధ ద్రవ్యాల బోర్డుకు రైతు ఐక్య వేదిక స్వాగతం

Satyam NEWS

మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి

Satyam NEWS

Leave a Comment