34.2 C
Hyderabad
May 14, 2024 19: 54 PM
Slider కవి ప్రపంచం

శాంతి సింధువు ధర్మ బంధువు

#K.Veena Reddy Meerpet

హిందుత్వం అంటే, హింసను ఖండించే హంస తత్వం!

హిందుత్వం అంటే, విశ్వశాంతిని కోరే సౌభ్రాతృత్వం!

హిందుత్వం అంటే, సామాజిక శ్రేయోదాయక ధర్మదర్శనం!

అంతేకాదు, శాంతికి భంగం కలిగించే దుర్మార్గాలను, అత్యాశతో అధర్మానికి పాల్పడే  దురాక్రమణలను,           ఎంతమాత్రం సహించలేని పౌరుషాగ్ని చరితం..

దేశంకోసం ప్రాణాలర్పించిన త్యాగాల భరితం..

వీర పరాక్రములగన్న మన తరతరాల భారతం!

శాంతి సహనం నీతి నియమం ధర్మం దైవం వంటి ప్రబోధాలు,

గీతోపనిషత్తుల వేదశాస్త్ర పురాణాల ప్రామాణికాలు!

దేశభక్తి దైవశక్తి జాలువారిన అలనాటి కవుల కృతులు,

సత్యాన్వేషణాసారములైనవి మన ఆధ్యాత్మిక ఆకృతులు!

హిందుత్వం అనేది ఒక మతం మాత్రం కాదు,

అది సక్రియాత్మకంగా జరిగే నిరంతర నిజ ప్రక్రియ!

హిందుత్వానికి మూలం ఏకత్వం సర్వమత సామరస్యం!

ఇది సిద్ధాంతాల ఆధారంగా నిర్మితమైంది కాదు,

ప్రకృతిపరమైన సహజానుభూతి దీనికాధారం..

పరమయోగులు మునుల తపోధ్యానాదుల ఫలసారం!

గుళ్లూ గోపురాలు శిల్పాలు శిలాశాసనాలు,

మనవాళ్ల ప్రజ్ఞకద్దంపట్టే విజ్ఞాన పర్వాలు,

మనపూర్వుల జీవన విధానాల పురావైభవాలు!

నిత్యనూతనమైనది, ప్రపంచ ప్రగతికి ప్రథమ సోపానమైనది

అన్నిమతములను కలుపుకున్న కమనీయ కల్పవృక్షమిది!

ఐనా, మతోన్మాదులకు బలౌతున్నది మన సనాతన సంస్కృతి..

ఐకమత్యంతో దాన్ని కాపాడుకోవడం మనందరి విధి!

కె.వీణారెడ్డి, హైదరాబాద్

Related posts

స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం సిఐటీయూ బైక్ ర్యాలీ

Sub Editor

కంప్లయింట్: ఏం కొనేట్టు లేదు ఏం తినేట్టు లేదు

Satyam NEWS

నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment