37.2 C
Hyderabad
April 26, 2024 19: 21 PM
Slider ఆధ్యాత్మికం

21న సీతారాముల కల్యాణోత్సవానికి భద్రాచలం సిద్ధం

#bhadradritemple

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో మంగళవారం వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఈనెల 27 వరకు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందు కోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, మామిడి తోరణాలను ఇప్పటికే సిబ్బంది ఏర్పాటు చేశారు.

కరోనా వైరస్‌ ప్రబలంగా ఉన్న నేపథ్యంలో కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం వేడుకలు జరగనున్నాయి.

21న శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ఆలయ ప్రాంగణంలోని నిత్యకల్యాణ వేదిక వద్ద నిర్వహించనున్నారు. 22న మహాపట్టాభిషేకం కూడా అదే వేదికలో జరగనుంది.

ఈ బ్రహ్మోత్సవాలను భక్తులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకపోవడంతో నిరాడంబరంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భద్రాద్రి రామాలయంలో మంగళవారం నుంచి ఈనెల 27 వరకు నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు.

అలాగే 17 నుంచి 27 వరకు దర్బారు సేవలను, ఈనెల 17 నుంచి మే 4 వరకు పవళింపు సేవలను కూడా నిలిపివేయనున్నారు.

Related posts

పొంగులేటికి మువ్వా కృతజ్ఞతలు

Bhavani

మహారాష్ట్రలో రేపే బలపరీక్షకు సుప్రీం ఆదేశం

Satyam NEWS

“బ‌జార్ రౌడి” తో స్టెప్పులేయించిన ప్రేమ్ ర‌క్షిత్‌

Satyam NEWS

Leave a Comment