39.2 C
Hyderabad
May 3, 2024 12: 49 PM
Slider కవి ప్రపంచం

ప్రేమ పూజారినయ్యా..

#Devalapally Sunanda

రంభ ఊర్వశిల అందాన్ని తలదన్నే అందమే నీది

హంసలకు నడకలు నేర్పే సోయగమే నీది

మయూరమే అసూయపడే నృత్యమే నీది

గులాబీ రేకులు నీపై స్పర్ధ పెంచుకునే సున్నితత్వమే నీది

నాగు పాములా బుసలు కొట్టే

నీ వాలు జడ వయ్యారానికి

దాసోహం అవ్వని వారుంటారా ఈ లోకంలో..!!

నీ వాలు కనుల కొంటె చూపుల్లో చిక్కుకుని

మరలి పోగలవారుంటారా ఈ లోకంలో ..!!

ఆహా ..! ఏమి నీ అందం ఓ వయ్యారిభామా..

దేవలోకం నుంచి దిగి వచ్చావా

లేక

బ్రహ్మదేవుడే నిన్ను ఇంతందంగా చేసి

ప్రాణంపోసి పంపాడా నా కోసం

నీ ప్రేమ వలపుల జడివానలో తడుస్తూ…

అనునిత్యం నీ ప్రేమ పూజారినై

నిను ఆరాధించనా..

నా గుండెనే నీ కోవెల చేసి

దేవలపల్లి సునంద

Related posts

317 జీ ఓ సవరించాలి: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి వినతిపత్రం

Satyam NEWS

ఎలిగేషన్: చంద్రబాబునాయుడు ప్రజావ్యతిరేకి

Satyam NEWS

డబుల్ బెడ్రూం ఇండ్ల అక్రమార్కులపై ఉక్కుపాదం

Satyam NEWS

Leave a Comment