మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీ కొనడంతో ఐదుగురు మహిళలు మరణించారు. మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామం నుంచి ఏడుపాయలకు వెళుతున్న డీసీఎం ను ఢీకొన్నది.
ఒక శుభకార్యం కోసం బంధువులతో కలిసి వెళుతున్న కుటుంబం డీసీఎం వ్యాన్ లో ఉన్నది. ఈ ఘటనలో డీసీఎంలో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారమందుకున్న ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.