Slider కవి ప్రపంచం

జెండా ఊంఛే ర‌హే హ‌మారా

#TirunagariSrinivasNew

పోరాటానికి  ప్ర‌తిరూపం

అస‌మాన త్యాగాల ఫ‌లితం

సర్వ  స్వతంత్ర‌త‌కు  నిర్వ‌చ‌నం

వినువీధిన ఎగురుతున్న

ఈ మువ్వ‌న్నెల  ప‌తాకం

భిన్న‌త్వంలో ఏక‌త్వం

సామూహిక జీవ‌న‌త‌త్త్వం

అనుబంధాల ప్ర‌తిరూపం

విశ్వానికి అందిన సందేశం

ఈ మువ్వ‌న్నెల  ప‌తాకం

ఉజ్వ‌ల ప్ర‌జా భార‌త‌మిది

స్వ‌ర్ణోత్స‌వ సంబుర‌మిది

మ‌హోజ్వ‌ల కాంతి నాద‌మిది

అజేయ‌మైన ఆత్మ విశ్వాస‌మిది

ధీర‌త‌తో సాగిన  ప్ర‌యాణ‌మిది

జెండా ఊంఛా ర‌హే హ‌మారా

వందేమాత‌రం… వందేమాత‌రం

జ‌య‌హో భార‌త్.. విజ‌య‌హో భార‌త్

డా. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్, 8466053933

Related posts

ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందిస్తా

Satyam NEWS

నటరాజ రామకృష్ణ శతజయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

Satyam NEWS

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అందరూ హాజరుకండి

Satyam NEWS

Leave a Comment