30.7 C
Hyderabad
April 29, 2024 06: 23 AM
Slider కవి ప్రపంచం

బోన్సాయ్ మొక్క

#Manjula Surya

భావితరం భవిత తెలియక నేడు

బేల చూపులు చూస్తుందేమిటి

బడితోట విరబూసిన నవ్వుల పువ్వులు

లేక వాడిపోయిందేమిటి

చిలిపి అల్లరులు చిన్నారుల సందడులతో

దద్దరిల్లే తరగతి గది ఒక్కసారిగా

మూగనోము నోచిందేమిటి

కొత్త కొత్త యూనిఫారంని

కొత్తగా చూసే కోటి దివ్వెల కాంతులు

నేడు కొత్తదనమే లేక చిన్నబోయేనేమిటి

పుస్తకాలకు అట్టలు వేస్తూ పేర్లు రాస్తూ

తీరిక దొరకని ఆ చిన్ని చేతులు

ఖాళీగా నేడు కనపడేనేమిటి

కొత్త బూట్లతో కొత్త సాక్సులతో

టక టక మంటూ తిరిగే కాళ్ళు

మెత్తగా నేడు నడిచేనేమిటి

స్నేహితులతో అల్లరి లేక బుడతడు

నేడు బెల్లం కొట్టిన రాయి వలె నిమ్మకుండెనేమిటి

పంచుకుంటూ దాచుకుంటూ

లాక్కుంటూ తినే లంచ్ టైం మధురంగా గుర్తుకు రాగా

ముద్ద దిగనీయకుండా చేసేనేమిటి

మొగ్గలా చేరి పువ్వులా వికసించి

ప్రపంచం ముంగిట్లో

వికాసాన్ని పంచే ఆ పువ్వుల

రంగులు వెన్ను తట్టే మాష్టారి తోడులేక

నేడు వెలవెల బోయేనేమిటి

ప్రకృతి ఒడిలో పాఠాలు కాస్తా

తరగతి గదికే బందీ అయ్యే

ఖర్మకాలిన కరోనాతో అది కాస్తా

ఇంటికే పరిమితమయ్యే

ఆటలైనా పాటలైనా

చివరకు పాఠాలైనా

యంత్రాలతోనే సహవాసం అనివార్యమాయే

మరి ఈ పూరేకులపై ఆ యంత్రం

ఏ మంత్రం  వేస్తుందో

వేచి చూడవలసిందే

ఏది ఏమైనా సహజములోనే సర్వతోముఖ

అభివృద్ధికి ఆస్కారము కానీ

కృత్రిమమైతే బోన్సాయ్ మొక్కనే మరి

ప్రకృతి విరుద్ధము కరోనాను తెస్తే

కరోనా మళ్ళీ మనకు కృత్రిమమే

రిటర్న్ గిఫ్టుగా ఇచ్చెను కదా!!

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

భారతీయులంతా గర్వించదగ్గ దర్శకుడు వసంత్ సాయి

Satyam NEWS

శారీరక, మానసిక ప్రశాంతతకు యోగ ప్రధాన సాధనం

Satyam NEWS

పోలీసులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కడప జిల్లా ఎస్పీ

Satyam NEWS

3 comments

Yssubramanyam June 8, 2020 at 4:53 AM

Excellent

Reply
Yuddandi Siva Subramanyam June 9, 2020 at 4:17 AM

excellent articulatin manjulamma garu

Reply
Yuddandi Siva Subramanyam June 9, 2020 at 11:24 AM

చాలా బాగా వివరించారు మంజులమ్మ గారూ

Reply

Leave a Comment