30.7 C
Hyderabad
April 29, 2024 03: 59 AM
కవి ప్రపంచం

నిస్వార్థ భావనే ప్రేమ

#Vedaardham Madhusudhana Sharma

సకల చరాచర జీవరాసిలో

ఉంటుంది ప్రేమ.

యువతీ యువకుల్లో కలిగే

ప్రేమ ప్రత్యేకం.

ప్రేమ రెండక్షరాల పవిత్ర భావన.

ప్రేమ రెండు మనసులను కలిపే వేదమంత్రం.

ప్రేమంటే మమతానురాగాల బంధనం.

ప్రేమలో ఆకర్షణ కాదు

అనురాగం ముఖ్యం.

ప్రేమలో కనిపించకూడనిది ద్వేషం.

స్వార్థం లేని,నిష్కల్మషమైనది ప్రేమ.

ప్రేమికుల మధ్య ఉండాలి ఈ భావన.

పెద్దల మనసులను గెలుచుకున్న ప్రేమ శాశ్వతం.

ప్రేమ పరిణయంగా మారితే

జీవితం అవుతుంది పూల వనం.

ప్రేమలో నిజాయితీ ఉంటే

ఆ అనుబంధం చిరకాలం సుస్థిరం.

ప్రేమలో ఆటంకాలను జయిస్తే

విజయతీరాన్ని చేరుకోవడం తథ్యం.

వేదార్థం మధుసూదన శర్మ, కొల్లాపూర్, 9063887585

Related posts

ప్రకృతి కళలే ఉగాది కళకళలు

Satyam NEWS

నిశి నుండి వెలుగుకు

Satyam NEWS

తొలి జల్లు పలకరింపు

Satyam NEWS

1 comment

khreddiyi February 15, 2021 at 6:48 PM

వేదార్థం మధుసూదనశర్మ గారికి
శుభాభినందనలు!

Reply

Leave a Comment