24.7 C
Hyderabad
May 13, 2024 04: 24 AM
Slider కవి ప్రపంచం

సంక్రాంతి దర్శనం!

#J Shayamala New

ఆకాశాన ఎగిరే రంగురంగుల పతంగులు

ఇంద్రధనస్సు అందాలను ఇక మరిచిపొమ్మంటే

కదిలే ఊహలను కట్టిపడేద్దామని కుంచెనందుకున్నా !

వరి కంకులపై వాలుతూ పక్షుల కిలకిలలు

సూరీడి పలకరింపుకు పులకిస్తూ సెలయేటి గలగలలు

మనసు మంజులనాదం కాగా పాటందుకున్నా!

అటు చూస్తే ఆనంద నాట్యాల నెమలి

మైమరుస్తూ చేశా నేనూ పద నర్తనం

పట్నం నుంచి తరలి వచ్చిన చుట్టాలతో

పల్లె నిండా మమతల పరిమళం వీస్తుంటే

అంతరంగంలో  ఆత్మీయతానురాగాలు!

ముంగిళ్ల మురిపించే రంగవల్లులు

సుస్వాగతాలు పలుకుతుంటే

ఆనందాల మది అందిలా..

మంచి మార్పుకు సంకేతంగా

మకర రాశికి మారిన మార్తాండుడు

భోగిపండ్లు, బొమ్మల కొలువులు

కొత్త ధాన్యపు పొంగళ్ళు,  అరిసెలు

తియ్యందనాల సంతోషాలు

సరికొత్తగా దర్శనమిచ్చిన సంక్రాంతి!

సదా నిలవాలి ఈ సంస్కృతి !

జె.శ్యామల

Related posts

థర్డ్ఐ:సొమ్ము వాడుకున్నఉద్యోగి సస్పెన్షన్

Satyam NEWS

ఎట్టకేలకు పెద్దపల్లి పోలీసులకు దొరికిన కిడ్నాపర్లు

Satyam NEWS

తిరుమలకు కాలి నడకలో తగ్గిన భక్తులు

Bhavani

3 comments

Gannavarapu+Narasimha+Murty January 14, 2023 at 12:32 PM

సంక్రాంతి మీద కవిత చాలా బాగుంది.పల్లె కనిపించింది

Reply
Mramalakshmi January 14, 2023 at 2:01 PM

కవిత బాగుంది మేడం ??

Reply
J+GuruPrasad January 14, 2023 at 5:35 PM

Excellent narration on Sankranthi festival
Syamala garu

Reply

Leave a Comment