పెద్దపల్లి జిల్లా కేంద్రం జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఇటుక బట్టీ యజమాని నల్లూరి సిద్ధయ్య (45) ను గత నెల 25న ఎవరో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన సిద్ధయ్య ఫోన్ నుంచి కిడ్నాపర్లు ఆయన భార్యకు ఫోన్‌చేసి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసి పెట్టాలని సూచించారు.
ఇన్నోవా వాహనాన్ని పెద్దపల్లి నుంచి పరిసరాల ప్రాంతాలకు తిప్పుతూ పలుమార్లు ఆయన భార్యకు ఫోన్‌చేశారు. చివరకు అర్ధరాత్రి 1.30 గంటలకు సిద్ధయ్య ఇంటి కి వచ్చి ఆయన భార్య బయటికి వచ్చి డబ్బుల కవర్ ఇవ్వగానే సిద్దయ్య ని వదిలి వెళ్ళినారు. సిద్ధయ్యను కిడ్నాప్ చేసి ఆ సమయంలో అతడి జేబు లో ఉన్న రూ. 56 వేలు,బంగారు ఉంగరం ,ఎటిఎమ్ కార్డు లాక్కొని పిన్ నెంబర్ తీసుకోని వెళ్ళారని ఇచ్చిన పిర్యాదు మేరకు బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
పెద్దపల్లి డిసిపి పి.రవీందర్, ఏసీపీ హబీబ్ ఖాన్ ఆధ్వర్యంలో 7 బృందాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి చూడగా రెండు వాహనాలు గుర్తించారు. అక్కడ నుంచి పరిశోధన మొదలు పెట్టారు. సిద్దయ్య నుండి ఏటీఎం కార్డు తీసుకున్న నేరస్తులు తొర్రూర్, సూర్యాపేట కోదాడ,హైదరాబాద్ లోని ఉప్పల్ ఎటిఎం సెంటర్లు, పెట్రోల్ బంకులో కార్డు ఉపయోగించి నగదు తీసుకున్నారు.
ఈ రెండు ఆధారాలతో కేసు దర్యాప్తు ప్రారంభించారు. పక్కా సమాచారం మేరకు రంగంపల్లి ఆర్టీఏ ఆఫీస్ ఎదురుగా ఉన్న రాజీవ్ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖి చేశారు. అటు వైపుగా వచ్చిన ఇన్నోవా, టవేరా వాహనాలను అపి తనిఖీ చేస్తుండగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి గుండ రజిని గా పోలీసులు నిర్ధారించారు.
రజిని తోబాటు ప్రవీణ్ అతని తమ్ముడు రమేష్, కిరీటి, మున్నా డ్రైవర్ షేక్ బాషా, షకీల్ లు రెండు వాహనాల్లో ఈ కిడ్నాప్ చేశారు. డబ్బులు ఎంతో అవసరం ఉన్న వీరు సిద్దయ్య వద్ద పెద్ద మొత్తంలో క్యాష్ ఉంటుందని ముందుగానే తెలుసుకుని ఒక పథకం ప్రకారం కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు.
పెద్దపల్లి డీసీపీ పి.రవీందర్, ఏసిపి హబీబ్ ఖాన్, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, సుల్తానాబాద్ సీఐ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ బాబు రావు, ఎస్ ఐ పెద్దపల్లి ఉపేందర్, బసంత్ నగర్ ఎస్ ఐ జానీ పాషా, ధర్మారం ఎస్ఐ ప్రేం, జూలపల్లి ఎస్ ఐ లక్ష్మణ్, సుల్తానాబాద్ ఎస్ ఐ రాజేష్, కాల్వశ్రీరాంపూర్ ఎస్ ఐ ప్రగతి ఈ దర్యాప్తులో పాలుపంచుకున్నారు.