30.3 C
Hyderabad
March 15, 2025 10: 07 AM
Slider కవి ప్రపంచం

ఎందుకీ విషాదం

VVS Krishnakumari

ఎందుకీ విషాదం

స్వయం కృతాపరాధమా

గత చరిత్ర నేర్పిన పాఠాలు

మరుగున పడ్డాయా

ఎవరో చేసిన తప్పిదాలకు

సామాన్యులు బలి

కావలసిందేనా

ఒకపక్క మానవ నిర్మితమో

లేక సహజ సిద్ధమో తెలీని

ఒక క్రిమి  కరోనా

పేరిట నోరు తెరచి

విరుచుకు పడుతుంటే

పులి మీద పుట్రలా

విశాఖ ను విషాదం గా

మార్చిన ఉదంతం

మృత్యు ఘంటికలు

ఎప్పుడు ఎక్కడ

మ్రోగుతాయో తెలీకుండా

మానవాళికి ప్రశ్నలే

మిగులు తున్నాయి

నాటి భోపాల్ ఘటన

పునరావృత మయింది

నాటి చేదు అనుభవాలు

మరుగున పడకముందే

నేడు స్టైరీన్ పేరిట

మృత్యువు విశాఖ

వాసులపై దాడి చేసింది

పిల్లలు, పెద్దలు

పశువులు, పక్షులు

ఆకులు రాలినట్లు

రోడ్లు మీద పడున్న దృశ్యం

మన భయంకర కృత్యాలకు

ప్రత్యక్ష సాక్షి యై

నిలుస్తున్నది

వి.వి.యస్.కృష్ణకుమారి, తుర్కయాంజాల్

Related posts

ఎర్ర పతాక నీడలో…

Satyam NEWS

కిషన్‌ రెడ్డికి అరుదైన గౌరవం

mamatha

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అరెస్టు

Satyam NEWS

1 comment

RAMBABU EMMADI June 27, 2020 at 12:11 PM

All categories lo updated well sir
కవిప్రపంచం lo Kavita post చేయాలంటే ఎలా? Mail చేయాలా? వాట్సప్ చేయాలా తెలుపగలరు
Thanks sir
ఇమ్మడి రాంబాబు తొర్రూరు
జిల్లా మహబూబాబాద్
9866660531

Reply

Leave a Comment